బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన చిత్రం ‘కేదార్‌నాథ్’. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం… 2013లో ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రం నిన్న శుక్రవారం రిలీజైంది. రిలీజైన మార్నింగ్ షోకే ఈ సినిమా కు ప్లాఫ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ పూర్తి డ్రాప్.. ఈ నేపధ్యంలో అది చాలదన్నట్లు ఈ ఫిల్మ్‌ను ఉత్తరాఖండ్‌లో బ్యాన్ చేశారు.
మొదట నైనిటాల్, ఉద్దమ్‌సింగ్ నగర్ జిల్లాల్లో ఈ సినిమాను నిషేధించినట్లు వార్తలు వచ్చాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా సినిమాను నిషేధించారని ఆ రాష్ట్ర మంత్రి సత్యపాల్ మహారాజ్ తెలిపారు. కేదార్‌నాథ్ సినిమాపై వివాదం చెలరేగడంతో దాన్ని బ్యాన్ చేసినట్లు సమాచారాం. సినిమాకు సంబంధించిన రిపోర్ట్‌ను సీఎంకు అందజేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకు కూడా ఆదేశాలు జారీ చేశామన్నారు.
సినిమాలో కల్పిత అంశాలు ఎక్కువగా ఉన్నాయని, సంస్కృతీ సాంప్రదాయాలకు దగ్గరగా లేదని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. కేదార్‌నాథ్ సినిమాను బ్యాన్ చేయాలని వేసిన పిల్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టిపారేసింది. 2013లో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమాను తీశారు.
ప్రేమకథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సారా అలీ ఖాన్ ఓ హిందూ అమ్మాయిలా, సుశాంత్ రాజ్‌పుత్ ఓ ముస్లిం అబ్బాయిలా పాత్రలు పోషించారు.