‘బాహుబలి’ రిలీజ్ తరువాత ప్రభాస్ మార్కెట్ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది . కొత్తగా పెరిగిన తన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి టైమ్ లోనే ఒప్పుకున్న చిత్రం సాహో సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ ఆశలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా శాటిలైట్ డీల్ రీసెంట్ గానే పూర్తైంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఓ ప్రముఖ సంస్థ సాహో శాటిలైట్ హక్కుల 70 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సదరు సంస్థ మూడు భాషలకు కలపి 70 కోట్లుకు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకుందట. తెలుగు సినిమా చరిత్రలోనే మరే చిత్రానికి ఈ రేట్ రాలేదన్నది నిజం. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ సంస్థ దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఇక సాహో చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? అన్నదానిపై ఏ క్లారిటీ లేదు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. అందువల్ల వీఎఫ్ఎక్స్ పనులకు చాలా సమయం తీసుకుంటుంది. ఈ చిత్రాన్ని 2019 ఆగస్టులో రిలీజ్ చేస్తే బావుంటుందని, ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా కన్ఫామ్ చేయాల్సి ఉంది.