సన్ పిక్చర్స్ మురుగ దాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నిర్మించిన అత్యంత భారీ సినిమా “సర్కార్ ” . కళానిధి మారన్ రుపొంచించిన రాజకీయ చిత్రం “సర్కార్”. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు వున్నాయి , అలాగే వివాదాలు వున్నాయి . అయినా అన్నింటినీ తట్టుకొని ప్రపంచమంతా విడుదలైయ్యింది . కలెక్షన్ల వర్షం కురిపించింది . మంగళవారం విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.
సర్కార్ తొలి రోజు షేర్ 36. 8 కోట్లు కాగా గ్రాస్ 66. 9 కోట్లు వాసులు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం . తమిళనాడు షేర్ 20. 6, గ్రాస్ 31.,6 కేరళలో షేర్ 2.9, గ్రాస్ 6., 5, కర్ణాటకలో షేర్ 2.,7 గ్రాస్ 6. 1, రెండు తెలుగు రాష్ట్రాల్లో షేర్ 2. 3, గ్రాస్ 3. 6, అమెరికా షేర్ 1. 5, గ్రాస్ 3. 7, దుబాయ్ మరియు మిగిలిన గల్ఫ్ దేశాలు షేర్ 2. 9, గ్రాస్ 6. 4, ఇతర దేశాలు షేర్ 3. 9, గ్రాస్ 9. 0, వసూలు చేసినట్టు తెలిసింది .
సినిమాను ఈ స్దాయిలో అదరిస్తున్నప్పటికీ ‘సర్కార్’కు మరో వివాదం తలెత్తింది. తాజాగా ‘సర్కార్’లో అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు సన్నివేశాలు ఉన్నాయంటూ సదరు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటిని వెంటనే తొలగించకపోతే ఆందోళనలు చేపడతామని డిమాండ్ చేస్తున్నారు.
విజయ్ , ఏ ఆర్ రెహ్మాన్ కాంబినషన్లో వచ్చిన మూడవ సినిమా . ఇయితే ఈ సినిమా విషయంలో రెహ్మాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేపధ్య సంగీతం సమకూర్చారని , అందుకే సినిమా ఆసక్తికరంగా వచ్చిందని అంటున్నారు .
సర్కార్ సినిమాలో థీమ్ సంగీతం సినిమాకు బాగా హెల్ప్ అయ్యిందని , ఈ థీమ్ సంగీత నేపధ్య దృశ్యాలను అమెరికాలో చిత్రీకరించారట .
సర్కార్ సినిమా తొలిరోజు కల్లెక్షన్ చూసి సన్ పిక్చర్స్ వారు మహదానందంగా ఉన్నారట .