రామ్ చరణ్ కి ఇది ఆల్‌టైం రికార్డ్‌

‘భయపెట్టడానికైతే పది నిమిషాలు, చంపేయడానికైతే పావుగంట. ఏదైనా ఓకే.. సెలెక్ట్‌ చేస్కో’ అంటూ తమ హీరో చెప్పే డైలాగులు రామ్ చరణ్ అభిమానులకు తెగ నచ్చేసాయి. రీసెంట్ గా విడుదలైన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’టీజర్ శుక్రవారం విడుదలైంది.

అలాగే ఈ చిత్రంలో రామ్‌ చరణ్ తన సొంత పేరు రామ్ కొణిదెల అంటూ కనిపించనున్నారు. ‘నువ్వు పందెం పరశురామ్‌ అయితే నేను రామ్‌ కొ.ణి.దె.ల’ అంటూ చరణ్‌ చెప్పిన ఈ డైలాగ్‌ టీజర్‌లో దుమ్ము రేపే మరో ఎలిమెంట్.
ఈ చిత్రం టీజర్‌ నిండా అడుగడుక్కి బోయపాటి శ్రీను మార్క్‌ మాస్‌ అంశాలు కనిపించటంతో ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.

దాంతో ఈ టీజర్ ఇంటర్నెంట్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో 15.1 మిలియన్ల( కోటీ 50 లక్షలకు పైగా) డిజిటిల్ వ్యూస్‌ సాధించి రికార్డ్‌ సృష్టించింది.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అళాగే మాజీ హీరోలు ప్రశాంత్‌, ఆర్యన్ రాజేష్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.