బాక్సాఫీస్ రిపోర్ట్ : అదరగొట్టిన “గాలోడు”.. ఫస్ట్ డే వసూళ్లు డీటెయిల్స్ చూడండి.!

తెలుగు బుల్లితెర మినీ పవర్ స్టార్ సుధీర్ ఆనంద్ అలియాస్ సుధీర్ ఆనంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ చిత్రం “గాలోడు”. అయితే సుధీర్ ని హీరోగా లాంచ్ చేసినప్పుడు నుంచి కూడా సుధీర్ ని చూసేందుకు ఆడియెన్స్ థియేటర్స్ వరకు వస్తారా అని డౌట్ ఉండగా దానిని అయితే ఈ యువ నటుడు తప్పని ప్రూవ్ చేసి ఫస్ట్ సినిమా తోనే సత్తా చాటాడు.

అయితే ఇప్పుడు మాస్ సినిమా “గాలోడు” అనే సినిమాతో వచ్చిన తాను ట్రేడ్ వర్గాలకి షాకిచ్చాడని తెలుస్తుంది. అవ్వడానికి కాస్త బి గ్రేడ్ టైప్ సినిమానే అయినా కేవలం సుధీర్ క్రేజ్ తోనే ఈ చిత్రానికి మొదటి రోజు క్రేజీ వసూళ్లు నమోదు అయ్యినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

ఇక గాలోడు ఫస్ట్ డే ఎంత రాబట్టింది అంటే 1 కోటికి పైగా గ్రాస్ ని ఈ చిత్రం కొల్లగొట్టింది అట. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ చిత్రం రెండో రోజు కూడా ఉత్తరాంధ్ర, నైజాం లో స్ట్రాంగ్ గా నిలుస్తూ కొనసాగుతుందట. ఇక ఈ సినిమా ఏరియాల వైజ్ వసూళ్లు చూసినట్టు అయితే నైజాంలో 36 లక్షలు సీడెడ్ లో 18 లక్షలు అలాగే ఇక మిగతా ఆంధ్ర జిల్లాల్లో అధికంగా 47 లక్షల గ్రాస్ రాబట్టగా రెస్టాఫ్ ఇండియా నుంచి మరో 3 లక్షలు రాబట్టిందట.

దీనితో మొదటి రోజు ఈ చిత్రం 1.04 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం అందుకుందట. అలాగే 50 లక్షల మేర షేర్ ని ఈ చిత్రం అందుకున్నట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఇక ఈ చిత్రానికి 3 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు కూడా టాక్ ఉంది. మరి ఈ చిత్రం ఆ టార్గెట్ ని రీచ్ అవ్వదు అని ఈ వసూళ్లతో అయితే చెప్పలేము. ఇక ఈ సినిమాలో సుధీర్ సరసన గేహన సిప్పి హీరోయిన్ గా నటించగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించాడు.