‘2.0’: ఆల్ టైమ్ రికార్డ్…ఏ సినిమాకూ దక్కనిది

ఈ రోజు ఎక్కడ విన్నా రజనీ-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 2.0 గురించే టాపిక్కే. ఇప్పటికే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు రికార్డ్ లు బ్రద్దలు కొట్టే పనిలో పడింది. రిలీజ్ కు ముందే రికార్డులను సెట్‌ చేసిన 2.0 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6800 థియేటర్లలో పదివేల స్ర్కీన్లపై ఈ చిత్రాన్ని రిలీజ్‌ అయ్యింది. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా ఈ మూవీ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

ఇక ఇప్పటికే పేటీఎమ్‌ ద్వారా 1.25 మిలియన్స్‌ టికెట్స్‌ అమ్ముడుపోయినట్టు సమాచారం. అలాగే బుక్‌మైషో ద్వారా దాదాపు పది లక్షల టికెట్లు దాకా బుక్ అయినట్లు సమాచారం. ఆన్‌లైన్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారానే ఇన్ని లక్షల టికెట్లు తెగడం ‘2.0 ’తోనే సాధ్యమైంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

ఈ సినిమాపై ప్రముఖ తమిళ సినీ విమర్శకుడు రమేష్‌ బాలా ‘ఇప్పటివరకు ఉన్న బాక్సాఫీస్‌ రికార్డులన్నింటికీ రిప్‌. శంకర్‌ మరోసారి తను విజన్‌ ఉన్న మాస్టర్‌ డైరెక్టర్‌ అని ప్రూవ్‌ చేసుకున్నాడు’ అంటూ ట్వీట్‌చేసి అభిమానులకు ఆనందం కలగచేసారు. ఇప్పటికే షోస్‌ చూసిన అభిమానులు తమ ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

రజనీ, అక్షయ్‌ కుమార్‌ నటనను పొగడ్తలతో ముంచెత్తుతుండగా.. శంకర్‌ అందించిన కథ,కథనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని, ఏఆర్‌ రెహమాన్‌ మరోసారి తన సంగీతం ద్వారా మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లాడంటూ, ఇండియన్‌ సినిమాలను శంకర్‌ మరో మెట్టు ఎక్కించారంటూ సోషల్‌ మీడియాలో ఈ చిత్రంపై పాజిటివ్‌ రియాక్షన్స్‌ వస్తున్నాయి.

మరో ప్రక్క తమిళ నాట అభిమానులు థియేటర్లలో అభిమానులు.. కటౌట్లు, పాలాభిషేకాలు, ఒంటిపై రజనీ బొమ్మలతో తమిళ తంబీలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.