రజనీ ‘పేట’ టాక్..కథ, హిట్టా..ప్లాఫా?

రజనీకాంత్ సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు ఉంటారు. ఆయన నుంచి ఎన్ని ఫ్లాఫ్ లు వచ్చినా మంచి ఓపినింగ్స్ రావటానికి అదే కారణం. ఆయన త‌న‌దైన‌ స్టైల్‌, మేన‌రిజంతో క‌ట్టిప‌డేస్తూంటారు . ముఖ్యంగా త‌మిళ‌నాట త‌లైవా సినిమా ఒక పెద్ద పండ‌గ‌. అలాగని తెలుగులోనూ ర‌జ‌నీ ఫ్యాన్స్ కు లోటేం లేదు. అందుకేనేమో ..ధియోటర్స్ నుంచి ఎన్ని సమస్యలు ఉన్నా… ఈ సంక్రాంతికి కూడా త‌న‌దైన స్టైల్‌, మేన‌రిజ‌మ్స్ అల‌రించేందుకు పేట‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. రీసెంట్ గా 2.0తో అల‌రించిన ర‌జ‌నీ కొత్త ఏడాదిలో హిట్ కొట్టాడా అంటే…జస్ట్ ఓకే సినిమా అని టాక్ అని వినిపిస్తోంది.

ఇప్పటికే ఎన్నో సార్లు చూసేసిన రజనీకాంత్ సినిమాల్లోని హిట్ అంశాలను తీసుకుని వాటిని కలుపుతూ ఈ సినిమా చేసారని టాక్. దాంతో పాత సినిమాను మళ్లీ చూస్తున్న ఫీల్ వచ్చింది. ముఖ్యంగా రజనీకాంత్ సూపర్ హిట్ బాషా ని మళ్లీ తీసారంటున్నారు. దాంతో ఈ సినిమా పెద్దగా కలిసొచ్చేటట్లు లేదు.

కథ

కాలేజీ హాస్టల్ వార్డెన్ గా చేస్తున్న కాళీ(ర‌జ‌నీకాంత్‌) కుర్రాళ్లలో ఒకడిగా కలిసిపోతాడ. అక్కడ ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన స్టైల్‌లో ప‌రిష్క‌రిస్తాడు. అందులో భాగంగా ఒక ప్రేమ జంట‌ను కూడా క‌లుపుతాడు. అనుకోని ప‌రిస్థితుల్లో లోక‌ల్ గూండాతో గొడ‌వ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో అతని పేరు … పేరు కాళీ కాదు… పేట అని రివీల్ అవుతుంది. అతను అక్కడికి రావటానికి కారణం.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని సింహాచ‌లం(న‌వాజుద్దీన్‌) అనే రాజ‌కీయ పెద్ద నాయ‌కుడితో విభేదాలే అని అర్దమవుతుంది. ఇంతకీ పేట ప్లాష్ బ్యాక్ ఏమిటనేది మిగతా కథ.