Pushpa Movie Collections: ‘పుష్ప’ ఖాతాలో మరో మైలు రాయి

Pushpa Movie Collections: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన ‘పుష్ప’ బాక్సఫీసు దగ్గర కలెక్షన్స్ తో బెంబోలిస్తుంది. బొమ్మ ఏ థియేటర్లో ఆడినా ‘తగ్గేదేలే’ అంటూ కలెక్షన్లు రాబడుతుంది. భాషా బేధం లేకుండా.. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా దేశంలో ఉన్న సినీ ప్రియులందరికీ పూనకాలు తెప్పిస్తుంది పుష్ప చిత్రం. ముందు డివైడ్ టాక్ అందుకున్నా.. ఆ తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చిన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, సునీల్, ఫహాద్ ఫాసిల్, అజయ్ గోష్, తదిరులు కీలక పాత్రలు పోషించారు.

బాక్సఫీసుని బద్దలు కొడుతున్న ‘పుష్ప’ సినిమా మరో మైలురాయిని అధిగమించింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.101.75 కోట్ల బిజినెస్ చేసింది. ఇందులో రూ. 67.24 కోట్లు కలెక్షన్స్ రూపంలో వచ్చాయి. కాగా.. తొలిరోజు రూ. 24.9 కోట్లు వసూలు చేసిన పుష్ప.. 7 వ రోజు వచ్చేసరికి 1.39 కోట్లు రాబట్టింది.