Balakrishna: డాకు తో రికార్డ్ సృష్టించిన బాలయ్య… ఏకంగా 530 కోట్లతో  సంచలనం!

Balakrishna: నందమూరి బాలకృష్ణ తాజాగా డాకు మహారాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బాలకృష్ణ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలయ్యి దాదాపు 15 రోజులవుతున్న నేపథ్యంలో 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనాలను సృష్టించింది.

ఒకానొక సమయంలో వరుస ప్లాప్ సినిమాలతో ఎంత సతమతమవుతున్న బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత వరుస చిత్రాలకు కమిట్ అవుతూ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక తాజాగా డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు.

ఇలా ఈ నాలుగు సినిమాలతో ఈయన ఏకంగా రూ.500 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ నాలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 530 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బాలయ్య పేరిట అరుదైన రికార్డు నమోదైంది. అఖండ రూ. 133 కోట్లు, వీరసింహారెడ్డి రూ.134 కోట్లు, భగవంత్ కేసరి రూ.132 కోట్లు చొప్పున మొత్తంగా 399 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా… డాకు మహారాజ్ ఇప్పటి వరకు రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇలా ఈ నాలుగు సినిమాలకు గాను ఏకంగా 530 కోట్ల కలెక్షన్లను సాధించి బాలకృష్ణ సరికొత్త రికార్డును సృష్టించారు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆఖండ 2 సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్న ఈ సినిమా ద్వారా బాలకృష్ణ సరికొత్త రికార్డులను సృష్టిస్తారనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పనులు జరుగుతున్న విషయం తెలిసిందే.