‘కల్కి’బిజినెస్ గురించి ఆశ్చర్యపోయే వార్త

గ‌త ఏడాది డా.రాజ‌శేఖ‌ర్‌ న‌టించిన `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ` బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. దాంతో తన తదుపరి చిత్రం విషయంలో రాజశేఖర్ ఆచి తూచి అడుగులు వేసారు. అ! వంటి విల‌క్షణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విన్నూత్న ద‌ర్శకుడు ప్రశాంత్ వ‌ర్మ డైరెక్షన్‌లో రూపొందున్న చిత్రానికి క‌ల్కి అనే చిత్రంలో చేస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు.

రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అవటంతో ఈ చిత్రానికి ఎక్కడా లేని డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత కే.కే.రాధామోహన్ బడ్జెట్ పై నలభై శాతం ఎక్కువ చెల్లించి తీసుకున్నారని సమాచారం. రాధా మోహన్ గతంలో బెంగాళ్ టైగర్ వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మి.. ‘కల్కి’ని తీసుకున్నారు. డిస్ట్ర్రిబ్యూటర్స్ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా ఈ సినిమా మంచి రేటు పలుకుతోందంటున్నారు.

ఈ శాటిలైట్ రైట్స్ కోసం తెలుగులో మూడు పెద్ద ఛానెల్స్ పోటీ పడుతున్నాయి తెలుస్తోంది. అలానే డిజిటల్ రైట్స్ విషయంలో కూడా ‘కల్కి’ రేటు భారీగానే పలుకుతున్నట్లు వినిపడుతోంది. అమెజాన్ ప్రైమ్ , జీ గ్రూప్ కూడా ఈ సినిమా రైట్స్ దక్కించుకునే పనిలో ఉన్నారు.. ఈ బిజినెస్ అనుకుంది అనుకున్నట్టు జరిగితే రాజశేఖర్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ చిత్రంగా నిలవడం ఖాయం అంటున్నారు.