‘మిస్ట‌ర్ మ‌జ్ను’ హిట్ అనాలంటే ఎంత కలెక్ట్ చేయాలి?

అఖిల్ అక్కినేని నటించిన మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అంతేకాదు ఈసారి అఖిల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. పోటీ ఏమీ లేకుండా సోలోగా వస్తున్నాడు. అవన్నీ బిజినెస్ పరంగా క్రేజ్ తెచ్చే అంశాలు. అయితే అఖిల్ కు ఒక్క హిట్ లేదు. దాంతో బిజినెస్ విషయంలో ఈ టాపిక్ కూడా వచ్చి బేరాలు జరుగాయి. ఈ నేపధ్యంలో ఏ మేరకు ‘మిస్టర్ మజ్ను’ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందో చూద్దాం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు `మిస్టర్ మజ్ను` ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అఖిల్ నటించిన మొదట సినిమా `అఖిల్`కి హైప్ క్రియేట్ చేసి సుమారు 40 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఆ సినిమా డిజాస్టర్ అవటంతో ఆ తర్వాత విక్రమ్ కుమార్ తో చేసిన `హలో` చిత్రానికి అంత బిజినెస్ సాగలేదు. ఇప్పుడు మూడవ సినిమాకి ఇంకాస్త తగ్గింది. అయితే లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి నో ప్లాబ్లం అంటున్నారు.

ఏరియా వైజ్ లెక్కలు చూస్తే…

నైజాం-6కోట్లు (అడ్వాన్స్)
సీడెడ్ -2.70కోట్లు (ఎన్ ఆర్ ఏ)
తూ.గో. జిల్లా- 1.50 కోట్లు (ఎన్ ఆర్ ఏ)
గుంటూరు- 1.50 కోట్లు (అడ్వాన్స్)
కృష్ణ- 1.35కోట్లు (ఎన్ ఆర్ ఏ)
ప.గో.జిల్లా- 1.25కోట్లు (ఎన్ ఆర్ ఏ)
నెల్లూరు -65 లక్షలు (ఎన్ ఆర్ ఏ)
ఏపీ – నైజాం కలుపుకుని 17.35 కోట్ల మేర మజ్ను థియేట్రికల్ బిజినెస్ సాగింది.
భారత్ లో మిగతా ప్రాంతాల్లో 1.50 కోట్లు
అమెరికా కలుపుకుని ఓవర్సీస్ లో 3.70 కోట్లు

అంటే దాదాపు 23 కోట్ల మేర షేర్ వరల్డ్ వైడ్ వసూలైతే అఖిల్ హిట్ కొట్టినట్లే…

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించారు. ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 25న విడుదలకానుంది. ఇక ‘అఖిల్ , హలో’ చిత్రాల తో హిట్ అందుకోలేకపోయిన అఖిల్ ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరో వైపు ఈ చిత్రానికి సోలో రిలీజ్ కూడా కలిసిరానుంది. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడోలేదో చూడాలి.