అఫీషియల్ :‘కాంచన 3’ రిలీజ్ డేట్ ఖరారు

డాన్సింగ్ స్టార్‌ రాఘవా లారెన్స్‌ మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ‘ముని’ సిరీస్‌లో తాజాగా ‘కాంచన 3’రిలీజ్ కు సిద్దం చేసారు. లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగులో లైట్‌హౌస్‌ మూవీమేకర్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రాఘవ నిర్మిస్తున్నారు.

తెలుగు తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ సిరీస్ లో విడుదలైన సినిమాలు హిట్ అవ్వడం వల్ల ఈ చిత్రం కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ఏప్రిల్ 19 వ తారీకున తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

రీసెంట్ గా ఈ సినిమాను మే 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముందుగానే పూర్తవుతుండటంతో ఏప్రిల్ లోనే సినిమాను రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు. ఏప్రిల్ 19న కాంచన 3 ప్రేక్షకుల ముందుకు కానుంది.

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డూపాడూ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, కబీర్‌ దుహన్‌ సింగ్, సత్యరాజ్, శ్రీమాన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.