సమంత ‘ఓ బేబీ’రిలీజ్ డేట్ ఫిక్స్

సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న రీమేక్ చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలు అనుకోకుండా 20 ఏళ్ల వయసున్న యువతి మారిపోతే ఎలా ఉంటుందనే చిన్న ఐడియాతో ఈ మూవీ వస్తోంది.

ఈ చిత్రం టీజర్ రీసెంట్ గా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.మ‌జిలీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న స‌మంత ఈ సినిమాతో మరో హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు.

Oh Baby Teaser | Samantha Akkineni, Naga Shaurya | Nandini Reddy | Suresh Productions

ఓ బేబిలో సమంత.. స్వాతి అనే సింగర్ క్యారెక్టర్‌లో కనిపించనుండగా, నాగశౌర్య ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి డైలాగ్స్ : లక్ష్మీ భూపాల, కెమెరా : రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ : జునైద్ సిద్దిఖీ, సంగీతం : మిక్కీ జె.మేయర్, కో-ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభోట్ల, యువరాజ్ కార్తికేయన్, వంశీ బండారు, నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ క్రాస్ పిక్చర్స్ .