బాక్సాఫీస్ : ఫస్ట్ వారంలోనే “బ్రహ్మాస్త్ర” కి మైండ్ బ్లాకింగ్ కలెక్షన్లు.!

బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “బ్రహ్మాస్త్ర” కోసం తెలిసిందే. గత వారం సరిగ్గా పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 9 వేల స్క్రీన్స్ లో రిలీజ్ కాగా మొదటి రోజే సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది.

అలా మొదట నాలుగు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అందుకుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు మరో లేటెస్ట్ అప్డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈరోజుతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర వారం రోజులు పూర్తి చేసుకోగా ఈ ఫస్ట్ వీక్ లో ఈ చిత్రం సెన్సేషనల్ వసూళ్లు అందుకున్నట్టు చెప్తున్నారు.

మరి ఈ సినిమా ఈ ఏడు రోజుల్లో అయితే ఏకంగా 300 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది అట. ఇది మేకర్స్ చెప్తున్నా అధికారిక నెంబర్ కాగా ఒరిజినల్ గా అయితే సుమారు దగ్గరలో వచ్చి ఉండొచ్చు అంతే. ఇప్పటికే చాలా వరకు వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి.

దీనితో ఓ కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ అలాగే ఆలీయా భట్ లు హీరో హీరోయిన్స్ గా నటించగా నాగార్జున, అమితాబ్, షారుఖ్ ఖాన్ తదితరులు ఇతర కీలక పత్రాలు పోషించారు.