బాక్సాఫీస్ : యూఎస్ లో ఈరోజు రిలీజ్ సినిమాల వసూళ్లు ఇవే..!

చాలా కాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో బాక్సాఫీస్ దగ్గర మంచి బజ్ మొదలయ్యింది. రెండు అవైటెడ్ చిత్రాలు “సీతా రామం” అలాగే “బింబిసార” చిత్రాలు భారీ ప్రమోషన్స్ మధ్య వచ్చాయి. అయితే ఈ చిత్రాలు ఒక దానితో ఒకటి పోటీ గానే వచ్చినా మరీ ముఖ్యంగా హిట్ స్టేటస్ చాలా అవసరం అందుకే ఈ పోటీ కూడా బాగుండాలని ట్రేడ్ వర్గాలు అయితే అభిప్రాయం పడ్డారు.

ఇక అంతా అనుకున్నట్టే ఈ వారం లో వచ్చిన ఈ సినిమాలు అదరగొడుతున్నాయని అంటున్నారు. దీనితో ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాలు మంచి ఓపెనింగ్స్ నే అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు తెలుపుతున్నారు. యూఎస్ లో లొకేషన్స్ పరంగా చూసుకుంటే సీతా రామం అలాగే బింబిసార సినిమాలు ప్రీమియర్స్ కి మంచి నంబర్స్ నే నమోదు చేశాయట.

దుల్కర్ సల్మాన్ మరియు హను రాఘవపూడి ల సీతా రామం 83 వేలకి పైగా డాలర్స్ ని రాబట్టగా నందమూరి కళ్యాణ్ రామ్ మరియు వశిష్ట్ ల బింబిసార చిత్రం 55 వేలకి పైగా డాలర్స్ ని కేవలం ప్రీమియర్స్ తో అందుకుందట. ఇవి రీసెంట్ టైం లో నిజంగా చాలా మంచి వసూళ్ళని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. అలాగే ఎలాగో టాక్ కూడా బాగానే వస్తుంది కాబట్టి వీటి టార్గెట్స్ ని డెఫినెట్ గా రీచ్ అయ్యిపోతాయని చెప్పొచ్చు.