బాక్సాఫీస్ రిపోర్ట్ : తెలుగు స్టేట్స్ లో “ది వారియర్” డే 1 వసూళ్ల వివరాలు ఇవే.!

the warrior

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ కం ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు ఎన్ లింగుసామి కాంబోలో వచ్చిన లేటెస్ట్ అవైటెడ్ మాస్ డ్రామా “ది వారియర్” కూడా ఒకటి. మాస్ లో డీసెంట్ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం తెలుగు సహా తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కగా రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమా మొదటి రోజు తెలుగు స్టేట్స్ లో నమోదు చేసిన వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. టాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు చెబుతున్న లెక్కల ప్రకారం అయితే ఏరియాల వారీగా చూసినట్టు అయితే.. నిజాం – 1.96 కోట్లు, సీడెడ్ – 1.04 కోట్లు, తూర్పు గోదావరి – 51 లక్షలు, వెస్ట్ గోదావరి – 67 లక్షలు, కృష్ణ – 38 లక్షలు, నెల్లూరు – 29 లక్షలు, వైజాగ్- 1.02 కోట్లు, గుంటూరు- 1.19 కోట్లు రాబట్టింది.

దీనితో మొట్ట అయితే ఏపీ మరియు తెలంగాణాలో కలిపి మొత్తం – 7.06 కోట్ల షేర్ ని ఈ చిత్రం రాబట్టిందట. అయితే ఇది ఒకింత డీసెంట్ నెంబర్ అనే చెప్పాలి కానీ అంచనాలకు తగ్గ వసూళ్లు మాత్రం కాదని చెప్పాలి. ఇంకా ఓవర్సీస్ లో అయితే చెప్పుకోదగ్గ వసూళ్లు కూడా నమోదు కాలేదు ఇంకా తమిళ్ నుంచి కూడా వివరాలు తెలియాల్సి ఉంది.

మొత్తానికి అయితే జస్ట్ ఓకే అనిపించే ఓపెనింగ్స్ వారియర్ కి దక్కాయి. వారాంతంలో ఎలాంటి వసూళ్లు నమోదు అవుతాయో తప్పకుండ చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఆది పినిశెట్టి విలన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.