వాల్మీకి ఫార్ములా క్లిక్కయ్యిందిగా
వరుణ్‌తేజ్ నటించిన మాస్ మసాల ఎంటర్‌టైనర్ `గద్దలకొండ గణేష్`. హరీష్‌శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది. రేసులు అంతకుముందు విడుదలైన చిత్రాల్ని పక్కకు నెట్టి నంబర్ వన్ గా నిలిచి భారీ వసూళ్లని సాధించే దిశగా పయనిస్తోంది. చివరి నిమిషంలో టైటిల్ వివాదం కారణంగా `వాల్మీకి` టైటిల్‌ని కాస్త `గద్దలకొండ గణేష్`గా మార్చినా కలెక్షన్లపై ప్రభావాన్ని చూపించలేకపోయింది. భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ని రాబట్టిన గణేష్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి 13 కోట్ల షేర్‌ని సాధించి మొదటిస్థానంలో నిలిచింది. నానీస్ గ్యాంగ్‌లీడర్‌ని వెనక్కి నెట్టి మంచి ఊపులో వుండటం గమనార్హం. నానీస్ గ్యాంగ్ లీడర్ కలెక్షన్‌లు తొలి వారంతో పోలిస్తే రెండవ వారం వచ్చేసరికి బాగా డల్ అయ్యాయి.
దీంతో రెండవ స్థానాన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత కొంత కాలంగా సరైన హిట్‌లేని సూర్య `బందోబస్త్` ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో ప్రస్తుతం మూడవ స్థానంలోకి జారిపోయింది. ఈ రెండు చిత్రాల తరువాత మంచి టాక్‌తో రన్ అవుతున్న సినిమా `డ్రీమ్‌గర్ల్`. విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంలో నటించాడు. రెండవ వారాంతంలో ఈ సినిమా వంద కోట్ల మార్కుని దాటింది. ఆయుష్మాన్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా 100 కోట్లు దాటిన రెండవ చిత్రంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. సంజయ్‌దత్ నటించిన `ప్రస్థానం` టాక్ బాగున్నా కలెక్షన్స్ పరంగా ఐదవ స్థానంలో నిలిచింది. మొత్తానికి ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఐదు సినిమాల్లో గద్దలకొండదే హవా సాగుతోందని డిక్లేర్ అయ్యింది.