ట్రేడ్ టాక్: ‘వాల్మికి’లాభమా? నష్టమా?

‘గద్దలకొండ గణేష్’ఫైనల్ రిజల్ట్?

సైరా సినిమా దెబ్బకు సైడ్ అయ్యిపోయింది వాల్మీకి. దాంతో వాల్మీకి పంపిణీ వర్గాలకు లాభమా నష్టమా? అనేది చర్చనీయాంసంగా మారింది. వాల్మీకి చిత్రం 14వ రోజు పూర్తయ్యే సరికి తెలంగాణ- ఆంధ్రాలో రూ.21 కోట్ల మార్కును.. ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మార్కును అధిగమించిందని చెప్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చుకున్న ‘వాల్మీకి’ సినిమాకు టాక్ యావరేజ్ గా వచ్చినా ఓపినింగ్స్ బాగుండటం కలిసొచ్చింది. ఫస్ట్ వీకెండ్ కూడా మాస్ టచ్ తో బాగానే రాబట్టింది. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని మీడియా మాట్లాడటం మొదలెట్టింది.

వాల్మీకి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.37.65 కోట్ల గ్రాస్ ను రూ.24.01 కోట్లు సాధించింది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా రూ.24.25 కోట్లు జరిగింది. దాంతో గద్దలకొండ గణేష్ లాభాల్లోకి రావాలంటే.. మరో కోటి అయినా మినిమం వసూలు చేయాలి. కానీ సైరా దెబ్బకు దాదాపు అన్ని థియోటర్స్ లోనూ ఈ సినిమాని తీసేసారు. వీటిన్నటి దృష్ట్యా‘గద్దలకొండ గణేష్’ ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యాడు.

నైజాం-7.76 కోట్లు.. సీడెడె- 3.41 కోట్లు.. తూర్పు గోదావరి -1.67 కోట్లు.. పశ్చిమ గోదావరి-1.40 కోట్లు.. గుంటూరు-1.8 కోట్లు.. కృష్ణా -1.4 కోట్లు.. నెల్లూరు- 82 లక్షలు వసూలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర చోట్ల వసూళ్లు కలుపుకుంటే ఓవరాల్ గా 24కోట్లు వసూలైంది.

మరో ప్రక్క ‘గద్దలకొండ గణేష్’ పట్ల జనాల్లో ఇక ఇంట్రస్ట్ కనిపించటం లేదు. దాంతో ఈ రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. షేర్ నామమాత్రంగా ఉంది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.25 కోట్ల షేర్ మార్కును అందుకోవటం కష్టమే అంటున్నారు. దాంతో బాగా లాభాలు వస్తాయని భావించిన బయ్యర్లకు నష్టాలు రానందుకు సంతోషించాల్సిన పరిస్తిది వచ్చింది. అలాగే ఈ సినిమాతో పెద్ద హిట్ ఖాతాలో వేసుకుంటానని ఆశించిన దర్శకుడు హరీష్ శంకర్‌కు కొంత నిరాశ తప్పలేదు.