గద్దలకొండ గణేష్ 7 రోజుల షేర్
వరుణ్ తేజ్ తాజా చిత్రం గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన రోజు నుంచి కలెక్షన్స్ ఫస్ట్ వీకెండ్ మూడు రోజులు ఎక్కడా డ్రాప్ అవకుండా నిలకడగా కొనసాగటంతో టీమ్ ఆనందంలో మునిగింది .ఆ తర్వాతే అసలు పరీక్ష మొదలైంది.
మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు మిగిల్చే దిసగా సాగుతోందనే ప్రచారం జరిగింది. అందులో నిజం కూడా ఉంది. కానీ ఊహించని విధంగా డ్రాప్ అవటం మాత్రం ఇబ్బందిగా మారింది. కాకపోతే మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో ‘గద్దలకొండ గణేష్’సి సెంటర్లలలో … బాగానే వసూళ్లు రాబడుతున్నాడు.
ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టినా. కానీ, సోమవారం నుంచి వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం 35 శాతం వసూళ్లు పడిపోయాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం మరో 30 శాతం కలెక్షన్ డ్రాప్ అయ్యింది. గురువారం కూడా ఇదే డ్రాప్ పరిస్థితి కనిపించింది. మరో ప్రక్క ఓవర్‌సీస్‌లో మాత్రం ‘గద్దలకొండ గణేష్’ దారుణంగా ఉంది. అక్కడ ఇప్పటి వరకు సుమారు 60 శాతం కూడా వసూలు కావటం కష్టమైంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ రైట్స్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.30 కోట్లకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.19.30 కోట్లకు విక్రయించారు. అయితే ఇప్పటికే ఏపీ, తెలంగాణలో రూ.17.03 కోట్లు వసూలైంది. ఇంకో రూ.2.5 కోట్లు వసూలైతే ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లంతా ఒడ్డున పడిపోతారు.
ఏరియా షేర్ (కోట్లలో)
——— ————–
నైజాం – రూ. 6.15 కోట్లు
సీడెడ్ – రూ. 2.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.10 కోట్లు
గుంటూరు – రూ. 1.50 కోట్లు
తూర్పుగోదావరి – రూ. 1.25 కోట్లు
పశ్చిమగోదావరి – రూ. 1.22 కోట్లు
కృష్ణా – రూ. 1.28 కోట్లు
నెల్లూరు – రూ. 73 లక్షలు
ఏపీ, తెలంగాణలో మొత్తం – రూ. 17.30 కోట్లు
దేశంలో ఇతర ప్రాంతాల్లో – రూ. 1.10 కోట్లు
ఓవర్‌సీస్ – రూ. 1.5 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా – రూ. 19.63 కోట్లు