బాక్సాఫీస్ రిపోర్ట్ : “విక్రాంత్ రోణ” ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే.!

ఈ ఏడాది పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యిన చిత్రాల్లో శాండిల్ వుడ్ కి చెందిన మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన భారీ విజువల్ మరియు యాక్షన్ చిత్రం “విక్రాంత్ రోణ” కూడా ఒకటి. ప్రముఖ దర్శకుడు అనూప్ భండారి తెరకెక్కించిన ఈ చిత్రం కర్ణాటక సహా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక షాకింగ్ ఓపెనింగ్స్ ని సెట్ చేసింది.

టాక్ కాస్త యావరేజ్ గానే వచ్చినా కూడా కొన్ని ఎలిమెంట్స్ బాగుండే సరికి మాత్రం తెలుగులో కూడా ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి వారం కంప్లీట్ చేసుకుంది.

ఇక ఈ సినిమాకి అయితే ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది. మొదటి 7 రోజుల్లో కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర చూస్తే ఈ సినిమా 70 కోట్ల గ్రాస్ ని అందుకోగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 7.55 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక తమిళ్ లో 3.4 కోట్లు వసూలు చేయగా హిందీ మరియు కేరళలో 12.6 కోట్లు అందుకుంది.

అలాగే ఓవర్సీస్ లో వచ్చే సరికి ఈ చిత్రం 4.65 కోట్లు అందుకుంది. దీనితో ఈ చిత్రం మొదటి వారానికి 100 కోట్ల గ్రాస్ కి చేరుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అలాగే ఫైనల్ రన్ లో అయితే ఈ చిత్రం డెఫినెట్ గా 150 కోట్ల మార్క్ దగ్గర ఆగుతుంది అని అంచనా వేస్తున్నారు. మొత్తానికి అయితే కిచ్చా సినిమా ,మాత్రం బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేస్తుంది అని చెప్పాలి.