బెల్లంకొండ ‘రాక్షసుడు’ టాక్: హిట్టా,ఫ్లాఫా?

బెల్లంకొండ ‘రాక్షసుడు’ టాక్: హిట్టా,ఫ్లాఫా?

పెద్దగా ఆడకపోయినా నటించిన ప్రతి సినిమాలోనూ నటుడిగా మంచి మార్కులు వేయించుకుంటూ వస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . అయితే ఇప్పటిదాకా సరైన హిట్ లేకపోవటం తో మార్కెట్ క్రియేట్ కాలేదు. వరస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే నటించిన ‘సీత’ సినిమా సైతం డిజాస్టర్ గా మారింది. దాంతో ఈసారి రీమేక్ ని నమ్ముకుని మన ముందుకు వచ్చారు. ఈ రోజు బెల్లంకొండ ‘రాక్షసుడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘రాట్సాసన్’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాక్షసుడు’ సినిమా లో బెల్లంకొండ హీరోగా నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. టాక్ ఏంటో చూద్దాం.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినిమా ఎక్కడా బోర్ కొట్టించకుండా ఆసక్తికరంగా సాగిందని చెప్తున్నారు. అయితే తమిళం సినిమాని యాజటీజ్ దింపేసారని ,పెద్దగా మార్పులు చెయ్యలేదని చెప్తున్నారు. ఒక సైకో కిల్లర్ ని వేటాడే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో కనిపించాడు. ఫస్టాఫ్ డీసెంట్ గా ఉన్నా ప్రెడిక్టుబుల్ స్ట్రక్చర్ తో వెళ్లిందని, సెకండాఫ్ మాత్రం బాగా ఎంగేజ్ చేసిందని, కాకపోతే బాగా ప్రొలాంగ్ గా అనిపించిందంటున్నారు.

ఈ సినిమా సక్సెస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో కీలకం కాబోతోంది. ఈ సినిమాతో బెల్లంకొండ కెరీర్ గాడిలో పడుతుందని భావిస్తున్నారు.