Bellamkonda Srinivas: వివాదాలు కూడా సినిమాకు మంచి ప్రమోషనే…. భైరవం వివాదంపై బెల్లంకొండ కామెంట్స్!

Bellamkonda Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా సంవత్సరాల తర్వాత తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ మంచు మనోజ్ నటించిన ఈ చిత్రం మే 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .

ఈ సినిమా దర్శకుడు సినిమా వేదికపై రాజకీయాల గురించి మాట్లాడటంతో వైసిపి అభిమానులు ఈ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ ఏకంగా ఒక హాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దర్శకుడు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ తాజాగా ఈ సినిమా విషయంలో ఈయన కూడా వివాదాలను ఎదుర్కొంటున్నారు.

ఇటీవల ట్రాఫిక్ పోలీస్ తో బెల్లంకొండ శ్రీనివాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే మంచు మనోజ్ కుటుంబ గొడవల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు కారణంగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇలా ఈ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుకోవడంతో ఈ వివాదాలపై బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ వివాదాలు చాలా మంచివే. సినిమాకు ప్రమోషన్ కింద కూడా ఉపయోగపడుతున్నాయి. అసలు ఎప్పుడూ వివాదాల్లోకి వెళ్లని నాకు కూడా అలా జరిగింది. మనోజ్ కి కూడా సినిమా షూటింగ్ మధ్యలో వారి ఫ్యామిలీ గొడవలు వచ్చాయని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు ఇంట్లోనే ఉండేవారని తనకు అక్కడి నుంచి క్యారేజ్ వచ్చేదని సాయి శ్రీనివాస్ తెలిపారు. ఇలా ఈ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు సినిమాకు మంచి ప్రమోషన్ అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.