వావ్… రిలీజ్ కు వారం ముందే ఈ సినిమాను చూడొచ్చు..!

ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా వారం ముందే చూసే అవకాసం వస్తే…వదులుకుంటామా…అదీ ఏ పైరసీ ప్రింట్ ద్వారానో కాకుండా అఫీషియల్ గా అయితే …ఇంక చెప్పేదేముంది. అలాంటి అవకాసం కల్పిస్తోంది ‘ఆక్వామన్‌’టీమ్. జేసన్‌ మొమోవా టైటిల్‌ రోల్‌లో కనిపించనున్న ఈ చిత్రంకు జేమ్స్‌ వాన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విడుదలకు ముందే చూసే అవకాశం ఉంది. అదెలాగంటే..?

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 21న విడుదల కాబోతోంది. అయితే అమెజాన్‌ ప్రైమ్‌లో సభ్యత్వం ఉన్నవారు ఈ చిత్రాన్ని విడుదలకు వారం ముందుగానే చూడవచ్చు. ఆటం టికెట్స్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఒక్కొక్కరూ పది టికెట్ల వరకు కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని చిత్ర యూనిట్ కల్పిస్తోంది.

ఆ టికెట్లతో భారతదేశంలోని ఏ థియేటర్‌లోనైనా ‘అక్వామన్‌’ చిత్రాన్ని చూసే అవకాశం ఉంది. గతంలోనూ అమెజాన్‌ ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించింది. ‘జుమాంజీ’ సినిమా విడుదల కావడానికి 12రోజుల ముందే ప్రైమ్‌ సభ్వత్వం ఉన్నవారికి ఈ చిత్రాన్ని చూసే అవకాశం కల్పించింది.

AQUAMAN - Final Trailer - Now Playing In Theaters

ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్‌ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఆక్వామన్‌ పుట్టుక, పెద్దవాడయ్యే కొద్ది అతనిలో కలిగే విచిత్రమైన మార్పులు, ఆక్వామన్‌గా మారడం వెనకున్న కారణాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. ఆంబర్‌ హర్డ్‌, ప్యాట్రిక్‌ విల్సన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం ఇదివరకు ఎవ్వరూ చూడని ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు గతంలో దర్శకుడు జేమ్స్‌ వాన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.