అడవి శేష్‌ ‘ఎవరు’ కలెక్షన్స్..చిన్న సినిమా పెద్ద హిట్

అడవి శేష్‌  ‘ఎవరు’ కలెక్షన్స్ 

క్షణం, గూఢాచారి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన మరో థ్రిల్లర్ మూవీ ఎవరు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ రామ్‌జీ దర్శకుడు. సైలెంట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్‌ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి మంచి హిట్ టాక్ వచ్చింది. దానికి తోడు ఈ చిత్రాన్ని విభిన్న రీతిలో ప్రమోషన్స్ చేయటం కూడా కలిసివచ్చింది. ఆగస్టు 14 రాత్రి మీడియాకు చూపెట్టడంతో…తెల్లారేసరికల్లా పాజిటివ్ రివ్యూలు రావటం, హిట్ టాక్ రావటం వెంట వెంటనే జరిగిపోయాయి.దానికి తగ్గట్లు ..నిన్న రిలీజైన శర్వా చిత్రం రణరంగం డిజాస్టర్ కావటం కూడా కలిసొచ్చింది.

మార్నింగ్ షోకు జనం కాస్త పలుచగా ఉన్నా… బావుందనే మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో రిలీజ్ రోజు మధ్యహ్నం షో నుంచి జనంతాకిడి పెరిగింది. ఆగస్టు 15 హాలిడే కూడా తోడవటంతో సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో ఫస్ట్ షో, సెకండ్ షో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.

ఈ మూవీ ఫస్ట్ డే వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో మొదటి రోజు ఈ చిత్రం రూ. 1.65 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. అడవి శేష్ హీరోగా ఇంతకు ముందు వచ్చిన ‘గూఢచారి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే ఈచిత్రం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన షేర్ రూ. 62 లక్షలు మాత్రమే. అయితే ఈ రికార్డు ‘ఎవరు’ తుడిచిపెట్టేయడమే కాదు… మూడు రెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది.

ఏరియా వైజ్ షేర్ చూస్తే..
నైజాం రూ. 64 లక్షలు,
సీడెడ్ రూ. 16 లక్షలు,
ఉత్తరాంద్ర రూ. 21 లక్షలు
గుంటూరు రూ. 13 లక్షలు,
ఈస్ట్ గోదావరి రూ. 21 లక్షలు,
కృష్ణ రూ. 15 లక్షలు,
వెస్ట్ గోదావరి రూ. 10 లక్షలు,
నెల్లూరు రూ. 5 లక్షలు 

ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్ రూ. 7 కోట్లకు అమ్మారు. తొలి రోజు రూ. 1.65 కోట్లు రావడంతో ట్రేడ్ వర్గాలను షాక్ ఇచ్చింది. ఇందులో అడివి శేషు ‘విక్రమ్‌’ అనే తమిళ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. ఈ సినిమా స్పానిష్ సినిమా రీమేక్‌. 2007లో రిలీజ్‌ అయిన ది ఇన్విజిబుల్‌ గెస్ట్ కు ఎవరుగా మార్చారు. ఇదే సినిమాను బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీల కాంబినేషన్‌లో బద్లా పేరుతో రీమేక్‌ చేశారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది.