జీవితంలో పెళ్లి చేసుకొనే ఆలోచనలే లేవు.. అప్పుడే అంతా అయిపోయింది: రెజినా

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి రెజీనా.ఈ మధ్యకాలంలో వెండితెరకు ఈమె పూర్తిగా దూరమయ్యారు. ఇలా వెండితెరకు దూరమైన రెజినా పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఒకవైపు వెబ్ సిరీస్లలో చేస్తూనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఈమె ప్రత్యేక పాత్రలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి రెజీనా పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.

రెజినా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రావడంతో తాజాగా ఈ వార్తలపై ఈమె స్పందించారు. ఈ సందర్భంగా రెజీనా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తనకు తన పెళ్లి గురించి ప్రశ్నలు తలెత్తాయి. ఇంటర్వ్యూలో భాగంగా రెజీనా మాట్లాడుతూ..తాను 2020వ సంవత్సరంలో ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నుంచి బ్రేకప్ చెప్పుకున్నానని ఆ రోజుతోనే నా జీవితంలో ప్రేమ పెళ్లి శకం ముగిసిందని ఈమె తెలిపారు.

ఇలా ప్రేమలో విఫలమైన తాను ఆ బాధ నుంచి బయటపడటం కోసం ఎంతో సమయం పట్టిందని ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటాను లేదో కూడా తనకు తెలియదు అంటూ ఈమె పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనకు ఇతరులపై ఆధారపడకుండా బ్రతకడం నేర్పించారు. ఇక ఇలాంటి సమయంలో తనకు పెళ్లి అవసరం లేదని తన కాళ్లపై తానుఎవరి సపోర్ట్ లేకుండా నిలబడగలను అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.