ఎవరు, రణరంగం యూఎస్ కలెక్షన్స్ పరిస్దితి ఇదీ!

ఎవరు, రణరంగం యూఎస్ కలెక్షన్స్ !ఏది వర్కవుట్ అయ్యింది

ఈ వారం ..శర్వానంద్ నటించిన రణరంగం, అడివి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎవరు చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా విడుదల అయ్యాయి. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎవరు చిత్రం మార్నింగ్ షోకే హిట్ టాక్ సొంతం చేసుకోగా, రణరంగం చిత్రానికి డివైజ్ టాక్ లభించింది. ఈ నేపధ్యంలో …మన తెలుగు సినిమాలకు అతిపెద్ద ఓవర్సీస్ మార్కెట్ అయిన యూఎస్ లో ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ రిపోర్ట్స్ చూస్తే..

ఎవరు చిత్రం యూఎస్ లో బుధవారమే ప్రీమియర్స్ ద్వారా $61,499 గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. హీరో అడివి శేషు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా నిలిచింది. ఇక గురువారం ఈ మూవీ $43,320 గ్రాస్ సాధించిందని సమాచారం. తాజాగా అందిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు ఎవరు చిత్రం యూఎస్ లో $1,21,822 గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

మరో ప్రక్క శర్వా రణరంగం పరిస్థితి యూఎస్ లో వర్కవుట్ కాలేదు. యూఎస్ ప్రీమియర్స్ లేకపోవడం ఈ మూవీ వసూళ్లపై చాలా ఎఫెక్ట్ చూపించింది. గురువారం ఈ మూవీ $24,014 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక తాజాగా అందిన లెక్కల ప్రకారం ఇప్పటివరకు రణరంగం కేవలం $27,892 గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్టు తెలుస్తుంది. తెలుగురాష్ట్రాలలోనూ మాత్రం ఈ మూవీ వసూళ్లు కష్టం అనిపిస్తున్నాయి.