బ్రేకింగ్: వరల్డ్ నెంబర్ 1 మూవీగా ‘2.0’

‘2.0’ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలబడింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజున రూ.100 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరి రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమా ప్రపంచ సినిమా భాక్సాఫీస్ వద్ద మరో రికార్డ్ ని క్రియేట్ చేసింది.

నవంబర్ 29న ఈ సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఈ నాలుగు రోజుల్లో ..2.0 చిత్రం అమెరికాలోని ఏ సౌతిండియన్ చిత్రం కలెక్ట్ చేయని మొత్తం సంపాదించి రికార్డ్ నెలకొలిపిందని ట్రేడ్ ఎక్సపర్ట్ రమేష్ బాలా తెలియచేసారు.

ఆయన ఈ సినిమా గురించి రాస్తూ….. నవంబర్ 29, డిసెంబర్ 2 మధ్య తేదీలలో ఇంటర్నేషనల్ (నార్త్ అమెరికా మినహాయించి) భాక్సాఫీస్ ని పరిశీలించి చూస్తే 2.0 చిత్రం ఊహించని విధంగా Fantastic Beasts: The Crimes of Grindelwald, Ralph Breaks The Internet కలెక్షన్స్ ని మించిపోయింది.

టాప్ 5 భాక్సాఫీస్ కలెక్షన్స్ ఈ క్రింద విధంగా ఉన్నాయి :

1. #2Point0 – $52.5 Million

2. #FantasticBeasts – $40.2 Million

3. #RalphBreaksTheInternet – $33.7 Million

4. #TheGrinch – $27.1 Million

5. #Venom – $13 Million

ఈ ప్రపంచం కేవలం మనుషుల కోసం మాత్రమే కాదని.. ఇంకా చాలా ప్రాణులు ఇక్కడ జీవిస్తున్నాయని గుర్తు చేసే చిత్రమే ‘2.0’. మొబైల్‌ ఫోన్‌ టవర్ల ద్వారా వచ్చే రేడియేషన్‌ ప్రభావం వల్ల పక్షులు చనిపోతున్నాయనే అంశాన్ని ఇందులో చూపించారు.
ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. దాదాపు రూ. 550 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. విడుదలకు ముందే శాటిలైట్‌, డిజిటల్‌ తదితర హక్కుల ద్వారా సినిమా దాదాపు రూ.370 కోట్లు రాబట్టిందట.