‘సాహో’ ప్రీ రిలీజ్ బిజినెస్…ఎంతొస్తే సేఫ్ ?(ఏరియావైజ్)

‘సాహో’ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు (ఏరియావైజ్)

రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ ఇచ్చిన ఉత్సాహంతో ప్రభాస్ తన తదుపరి చిత్రం విషయంలోనూ దూసుకుపోతున్నాడు. ఒక్క సినిమా మాత్రమే వయస్సు ఉన్న .. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు.

ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హాలీవుడ్ స్దాయిలో ఉన్న యాక్షన్ సీన్స్ ఖచ్చితంగా ప్యాన్స్ కు పండగ చేస్తాయంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఓ రేంజ్‌లో జరిగినట్టు సమాచారం. ఆ లెక్కలు ఏరియావైజ్ చూడండి.

ఏరియా                        షేర్ (కోట్లలో)

——————– —————————————-

నైజాం                 40 కోట్లు అడ్వాన్స్

సీడెడ్                   25 కోట్లు అడ్వాన్స్

ఈస్ట్, వెస్ట్                   18 కోట్లు NRA

ఉత్తరాంధ్ర                  15 కోట్లు అడ్వాన్స్

కృష్ణా ,గుంటూరు, నెల్లూరు      24 కోట్లు

మొత్తం ఆంధ్రా & తెలంగాణా         122 కోట్లు

నార్త్ ఇండియా             60 కోట్లు NRA

కర్ణాటక              28 కోట్లు అవుట్ రైట్

తమిళనాడు             16 కోట్లు NRA

కేరళ                4 కోట్లు

మొత్తం భారత్ లో               230 కోట్లు

ఓవర్ సీస్          42 కోట్లు అవుట్ రైట్

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం        272 కోట్లు

ఇవన్ని థియోటర్స్ రైట్స్ కు వచ్చిన మొత్తం. శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్, ఇంటర్నేషనల్ వెర్షన్స్, మిగతా రెవిన్యూలు కలిపి 500 కోట్ల వరకూ బిజినెస్ జరిగి ఉంటుందని అంచనా. బాహుబలి, 2.0 తర్వాత ఈ సినిమాకే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే గ్రాస్ 600 కోట్లు, 290 కోట్లు దాకా గ్రాస్ దాటి రావాల్సిందే.