బాక్సాఫీస్ : “పోకిరి” స్పెషల్ షోస్ వరల్డ్ వైడ్ వసూళ్లు డీటెయిల్స్ చూడండి.!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ట్రేడ్ వర్గాలు నివ్వెరబోయే సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి.. మరి అలాంటి సినిమాల్లో ఒకటే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “పోకిరి”. దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే హీరోయిన్ ఇలియానా ని కూడా నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టిన ఈ సినిమా అప్పట్లో రికార్డులతో పెను సంచలనాలు సృష్టించింది.

మరి ఇన్ని భారీ రికార్డ్స్ కొల్లగొట్టి సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ఈ సినిమాని రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ 27వ బర్త్ డే కానుకగా ప్రపంచ వ్యాప్తంగా మహేష్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ కొత్త వెర్షన్ ప్రింట్ ని రిలీజ్ చేసుకున్నారు.

దీనితో ఇది వరకు ఎప్పుడూ లేని భారీ మొత్తంలో వసూళ్లు ఓ సినిమా రీ రిలీజ్ కి నమోదు అయ్యాయి. మరి లేటెస్ట్ గా ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం ఈ సినిమా సింగిల్ డే లిమిటెడ్ స్క్రీన్స్ మరియు షోస్ తో ఏకంగా 1.23 కోట్లకి పైగా గ్రాస్ ని నమోదు చేసిందట.

ఇక ఏరియాల వారీగా చూసినట్టు అయితే నైజాం – 69 లక్షలు,ఉత్తరాంధ్ర – 24.9 లక్షలు, గుంటూరు – 13.02 లక్షలు, తూర్పు గోదావరి – 11.8 లక్షలు, పశ్చిమ గోదావరి – 5.4 లక్షలు అలాగే సీడెడ్ – 13.3 లక్షలు, కృష్ణ – 10.25 లక్షలు, నెల్లూరు – 4.41 లక్షలు ఇక ఓవర్సీస్ మరియు రెస్టాఫ్ ఇండియాలో 21.04 లక్షల గ్రాస్ ని వసూలు చేసింది. దీనితో మొత్తం ఒక ఆల్ టైం రికార్డుగా 1.73 కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమాకి రావడంతో సరికొత్త రికార్డు ఇప్పుడు నమోదు అయ్యింది. 
box office pokiri special shows record gross details here