‘డిస్కోరాజా’థియోటర్స్ కు వచ్చే రోజు ఫిక్స్

‘డిస్కోరాజా’రిలీజ్ డేట్ ఖరారు

‘మాస్‌ మహారాజా’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రవితేజ ఇప్పుడు ‘డిస్కో రాజా’గా మారారు. రవితేజ గత ఏడాది ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీని తర్వాత రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేం వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. బాబీ సింహా విలన్ గా కనిపించే ఈ చిత్రం దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తైంది. డిసెంబర్ 20న రిలీజ్ కు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘‘వైవిధ్యభరితమైన కథాంశమిది. హైదరాబాద్‌, గోవా, చెన్నై, మనాలీల్లో చిత్రీకరణ జరుపుతాం. తమన్‌ సంగీతమందిస్తున్నార’’ అని నిర్మాత రామ్‌ తళ్లూరి తెలిపారు.

‘డిస్కో రాజా’ చిత్రంతో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ హీరోయిన్ పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. వి.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. తమన్ బాణీలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం స్క్రిప్టుపై చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.