దిలీప్ కుమార్ కు ఆపేరు  ఎలా వచ్చిందో తెలుసా ?

ఈజోజు పద్మవిభూషణ్ , దాదా సాహెబ్ ఫాల్కే  అవార్డ్ గ్రహీత, హిందీ చిత్ర రంగంలో తిరుగులేని కథానాయకుడు  దిలీప్ కుమార్ పుట్టిన రోజు. దిలీప్ కుమార్ 96వ జన్మదినోత్సవం  జరుపుకుంటున్నాడు . గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగుండటం లేదు . తరచూ ఆసుపత్రికి వెడుతూ వున్నాడు .

దిలీప్ కుమార్ అంటే ప్రపంచంలో తెలియని సినిమా అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు . ఆయన్ని ట్రాజడీ  కింగ్ అంటారు. దిలీప్ కుమార్ 11 డిసెంబర్ 1922లో నేటి  పాకిస్తాన్ లోని పెషావర్ లో జన్మించాడు . ఆయన పేరు మహమ్మదు యూసఫ్  ఖాన్ .

అయితే కుటుంబ పోషణ కోసం పూనా వచ్చాడు అక్కడ ఒక కాంటీన్ యజమానితో పరిచయం పెంచుకొని  అక్కడే వారి సాహాయంతో శాండ్ విచ్చి స్టాల్  ఏర్పాటు చేసుకుంటాడు . అక్కడ డబ్బు సంపాదించుకొని బొంబాయి వస్తాడు . అక్కడ కూడా డబ్బు సంపాదించి తన తండ్రికి సహాయ పడాలని నిర్ణయించుకుంటాడు .  అప్పుడు డాక్టర్ మాసానితో పరిచయం అవుతుంది . వారి ద్వారా  బొంబాయి టాకీస్ దేవికా రాణి దగ్గర చేరతాడు . .బొంబాయి టాకీస్ లో చేరతాడు . అప్పుడతని నెల జీతం 1250 రూపాయలు

 

ఆమెకు యూసఫ్  ప్రవర్తన బాగా నచ్చుతుంది . అతని పేరును దిలీప్  కుమార్ గా మార్చుతుంది . 1944లో  “జ్వార్ భట ” చిత్రంలో నటించాడు . కానీ ఆచిత్రం అంతగా ఆడలేదు .  ఆతరువాత మరికొన్ని సినిమాల్లో నటించాడు కానీ అవేమీ అతనికి పేరు తెచ్చిపెట్టలేదు .

1947లో నూర్జహాన్ తో కలసి “జుగ్ను ” చిత్రంలో నటించాడు . అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది . ఇక దిలీప్ నట జీవితం ఊపందుకుంది . ఎన్నో సినిమాల్లో  నటించాడు . అయితే ఆయన జీవితంలో  ఎక్కువ పేరు తెచ్చిన సినిమా  కె . అసిఫ్  దర్శకత్వంలో 1960లో విడుదలైన “మొఘుల్ ఈ అజమ్ “. ఈ సినిమాలో అక్బర్ చక్రవర్తి కుమారుడు సలీంగా నటించాడు . తండ్రిగా పృథ్వి రాజకపూర్   అనార్కలిగా మధుబాల అద్భుతంగా  నటించింది .

1960 దశకంలో “మొఘుల్ ఈ అజమ్ “.  ఓ చరిత్ర . ఈ సినిమా ఒక్కటి చాలు దిలీప్ కుమార్ ప్రతిభకు . దిలీప్ ఓ లెజెండరీ ఆర్టిస్ట్ .