బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సుషాంత్ మృతిపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సుశాంత్ కుటుంబ సభ్యలు ఆత్మ హత్య చేసుకునేంత పిరికివాడు కాదని… ఇది కచ్చితంగా హత్యేనని లోతైన విచారణ చేయాలని కోరారు. దీంతో మృతిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. వెబ్ మీడియా కథనాలు ఎన్నో అనుమానాలకు తావిచ్చాయి. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదికలో రిపోర్ట్ లో ఎలా వస్తుంది! అన్న ఉత్కంఠ నెలకొంది. తాజాగా కొద్ది సేపటి క్రితమే ఆ రిపోర్ట్ ను డాక్టర్లు మీడియాకు అందజేసారు.
అందులో సుశాంత్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు తేల్చారు. ముంబై లోని జూహూ ఏరియాలో ఉన్న కూపర్ ఆస్పత్రిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. కొన్ని గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ప్రస్తుతం బాడీనీ కూపర్ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. ఇక దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో బాడీకి కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. అందులో నెగిటివ్ వచ్చింది. దీంతో బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం నివేదికతో సంబంధం లేకుండా తమ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సుశాంత్ మాజీ మేనజన్ కూడా ఆత్మ హత్య చేసుకోవడం వెనుక గల కారణాలను ఆరా తీస్తున్నారు. అలాగే ఆ రాత్రి సుశాంత్ తో ఉన్న స్నేహితుల్ని కూపీ లాగుతున్నారు. సుషాంత్ మృతిపై ఇప్పటికే బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లో విషాధ ఛాయలు అలముకున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధోనీ సినిమాతో సుశాంత్ కు తెలుగులోనూ ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. ఆయన మృతి తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానే కలచి వేసింది. చదువుల్లోనూ టాపర్ గా నిలిచిన సుశాంత్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం తెలివైన విద్యార్ధుల పట్ల కన్నీరు పెట్టిస్తోంది.