ఉత్తరాంధ్రలో, కృష్ణాలో పవన్ ఎంత లాగాడంటే

Vakeel Saab UA, Krishna collections report

Vakeel Saab UA, Krishna collections report

స్టార్ హీరోల సినిమా అంటేనే గుర్తొచ్చేది ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డులు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి హీరోల సంగతి చెప్పనక్కర్లేదు. ఓవరాల్ వసూళ్లు ఎలా ఉన్నా మొదటిరోజు ఎంత రాబట్టాడు అనేది అభిమానులకు ప్రిస్టేజ్ ఇష్యూ. విపరీతమైన అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హైప్ కు తగ్గట్టే వసూళ్లు కూడ గట్టిగానే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో మొదటిరోజు రూ.3.8 కోట్ల షేర్ రాబట్టుకుంది. ఉత్తరాంధ్రలో ఇది 6వ హయ్యస్ట్ ఓపెనింగ్స్ కాగా పవన్ కెరీర్లో సెకండ్ హయ్యస్ట్ ఓపెనింగ్స్.

ఇక కృష్ణ జిల్లా విషయానికొస్తే మొటిరోజు షేర్ హయ్యర్లతో కలిపి 1.9 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇది కూడ బ్రహ్మాండమైన వసూళ్ళని చెప్పవచ్చు. టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఉండి ఉంటే ఓపెనింగ్స్ ఇంకా ఎక్కువగా ఉండేవని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఉభయ గోదావరి జిల్లాల్లో, తెలంగాణలో కూడ వసూళ్లు పెద్ద మొత్తంలోనే ఉండే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల టాక్ ను బట్టి సినిమా ఫస్ట్ డే 35 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఉండవచ్చని తెలుస్తోంది.