కరోనా నుండి కోలుకున్న ఎన్టీఆర్ ఏం చెప్తున్నాడంటే

NTR recovered from Covid 19
NTR recovered from Covid 19
టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా తాకిడి ఎక్కువైన నేపథ్యంలో జూనిటర్ ఎన్టీఆర్ సైతం కరోనా బారినపడ్డారు.  మే 10వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.  అప్పటి నుండి హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు.  సుమారు రెండు  వారాల ట్రీట్మెంట్ అనంతరం ఆయన కొలుకున్నారు.  తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ రిపోర్ట్స్ రావడం జరిగింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.  తన కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు తారక్.  
 
ఈ రెండు వారాలు కిమ్స్ వైద్యుల బృందం ఎన్టీఆర్ కి ట్రీట్మెంట్ ఇచ్చారు. కోవిడ్ నుండి కోలుకున్న ఎన్టీఆర్ అందరికీ మెసేజ్ ఇస్తున్నారు. మంచి ట్రీట్మెంట్, పాజిటివ్ థింకింగ్ ఉంటే కరోనాను జయించవచ్చని అంటున్నారు. మీ మనోధైర్యమే కరోనా మీద యుద్ధం చేయడానికి అతి పెద్ద ఆయుధం అంటున్నారు.  ఎన్టీఆర్ కరోనా నుండి కొలుకున్నారనే సంగతి తెలియడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇకపోతే ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ దాని తరవాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా, ఆతర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నారు.