జాతిరత్నాలు’.. కొన్నవారు డబ్బులు పోసుకోవడమే

Jathi Ratnalu first day collections

Jathi Ratnalu first day collections

నిన్న విడుదలైన మూడు సినిమాల్లో ‘జాతిరత్నాలు’ ఒకటి. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. లాజిక్ లేకపోయినా మంచి ఫన్ ఉండటంతో జనాలు ఈ సినిమాకే ఓట్లు వేశారు. మిగతా రెండు సినిమాలు ‘శ్రీకారం, గాలి సంపత్’లను మించి ఈ సినిమా టాక్ తెచ్చుకుంది. మొదటి నుండి కూడ ప్రమోషన్ల ద్వారా ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశారు చిత్ర బృందం. ప్రభాస్ చేత ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండ రావడం లాంటి వాటి మూలంగా మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. అందుకే అన్ని సినిమాలకు మించి ఈ సినిమాకే మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

ఈ సినిమా నిర్మాణానికి అయింది 3.5 నుండి 4 కోట్ల మధ్యలోనే. హైప్, క్రేజ్ కారణంగా చిత్రాన్ని 10 నుండి 11 కోట్ల మధ్యలో అమ్మారట నిర్మాతలు. అంటే అక్కడే 5 నుండి 6 కోట్లపైనే టేబుల్ ప్రాఫిట్ చూశారు నిర్మాతలు. ఇక సినిమా ఫస్ట్ డే వసూళ్ల విషయానికొస్తే అవి 4 నుండి 4.5 కోట్ల వరకు ఉండొచ్చు. అంటే మొదటిరోజే పెట్టిన మొత్తంలో దాదాపు సగం రికవర్ అయినట్టే. ఇక శుక్రవారం, శనివారం, ఆదివారం కూడ ఈ సినిమా హవానే కొనసాగే అవకాశం ఉంది. దీన్నిబట్టి ఈ మూడు రోజుల్లో సినిమా ఇంకో 10 కోట్ల వరకు రాబట్టేలా ఉంది. అంటే డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాల్ని చూడటం ఖాయమన్నమాట. ఈ సినిమాతో నవీన్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా సెటిలవ్వడం ఖాయం.