వెండితెర ధోనీ 50 క‌ల‌లు ఇవే

బాలీవుడ్ లో స్టార్ హీరో స్టేట‌స్. న‌టుడిగా ఎంతో మంచి భవిష్య‌త్. రంగుల జీవితం. కోట్ల‌లో ఆదాయం. కానీ ఇవేవి సుషాంత్ సింగ్ రాజ్ పుత్ కి క‌నిపించ‌లేదు. 34 ఏళ్ల వ‌య‌సులోనే మ‌న‌స్థాపానికి గురై ఆత్మ హ‌త్య చేసుకుని సినీ ప్రియుల‌కు తీర‌ని శోకాన్ని మిగిల్చి అనంత‌లోకాల‌కి ఎగిసాడు. వెండి తెర ధోని ఇక లేడు..రాడు..మ‌ర్చిపోండి అనేసాడు. ఎలాంటి సినీ నేప‌థ్యంలో లేకుండా బాలీవుడ్ లో అడుగు పెట్టి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. టెలివిజ‌న్ నుటుడిగా, డాన్స‌ర్ గా ప్ర‌స్థానం మొద‌లు పెట్టి అంచ‌లంచెలుగా బాలీవుడ్ లో ఉన్న‌త స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడా స్థానం సుస్థిరం చేసుకునే స‌మ‌యంలో నింగికెగ‌సాడు. తాజాగా సుషాంత్ కి సంబంధించి ఓ యాభై డ్రీమ్స్ కు సంబంధించిన ట్వీట్లు వైర‌ల్ గా మారాయి.

ఇందులో కొన్నింటిని ఇప్ప‌టికే సాధించేసాడు. 1.విమానం నడపడం నేర్చుకోవాలి 2.ఎడమ చేతితో క్రికెట్ మ్యాచ్ ఆడాలి 3.మోర్స్ కోడ్ నేర్చుకోవాలి 4.పిల్లలకు స్పేస్, పాలపుంత గురించి తెలుసుకోవడంలో సహాయం చేయాలి 5.నాలుగు క్లాప్ పుషప్స్ చేయాలి 5బ్లూ హోల్‌లోకి డైవ్ చేయాలి 6.1000 మొక్కలు నాటాలి 7.ఢిల్లీలోని నా ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఒక సాయంత్రం గడపాలి 8.ఇస్రో, నాసాలో జరిగే వర్క్ షాపులకు 100 మంది పిల్లలను పంపించాలి 9.కైలాష్‌లో మెడిటేషన్ చేయాలి 10.ఒక బుక్ రాయాలి 10.ఆరు నెలల్లో సిక్స్ ప్యాక్ బాడీ సాధించాలి 11నాసా వర్క్ షాప్ మరోసారి అటెండ్ అవ్వాలి 12 అంధులకు కోడింగ్ నేర్పించాలి 13.వారం పాటు అడవిలో ఉండాలి 14. డిస్నీ ల్యాండ్ చుట్టి రావాలి 15.ఉచిత విద్య కోసం కృషి చేయాలి 16. మహిళలకు ఆత్మ రక్షణలో శిక్షణ ఇవ్వాలి 17. చిన్నారులకు డ్యాన్స్ నేర్పించాలి 18.లంబోర్‌ఘిని కార్ కొనుగోలు చేయాలి 19. స్వామి వివేకానంద జీవితంపై డాక్యుమెంటరీ తెరకెక్కించాలి ఇలా ఇంకా కొన్ని ఉన్నాయి.