మనిషిలో మార్పులకు కారణం పరిస్థితులన్నాడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. మనిషిని పరిస్థితులు ఎంతకన్నా దిగజారు స్తాయి..ఎంతకన్నా తెగించేలా చేస్తాయన్నాడు. పరిస్థితులే మనిషిని ప్రలోభ పెడతాయన్నాడు. జీవితంలో ఎదురుదెబ్బలు తిన్న వాళ్ల నిర్ణయాలు ఊహకందని విధంగా ఉంటాయని తన అనుభవం, నాలెడ్జ్ ని బట్టి వర్మ చెప్పాడు. అవును ఆయన అన్నది నిజమే అనిపిస్తుంది అప్పుడప్పుడు. తాజాగా వర్మ మాటనే బలపరుస్తూ ఓ బాలీవుడ్ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే…ఇటీవల బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనమైందో తెలిసిందే.
సుషాంత్ ఆత్మహత్యకు కారణాలు అనేకం తెరపైకి వచ్చాయి. నెపోటిజం , బాలీవుడ్ పెద్దలు కించపరిచడం, పరిశ్రమలో ఎదగనీయకుండా తొక్కేయడంతో విసుగుచెంది బలవన్మరణాని పాల్పడినట్లు రకరకాల ఆరోపణలు వినిపించాయి. దీంతో సుషాంత్ సింగ్ సరసన హీరోయిన్ సంజనా సాంఘి సంచలన నిర్ణయం తీసుకుంది. సుషాంత్ తో అమ్మడు దిల్ బేచారా సినిమాలో నటించింది. ఇదే అమ్మడి తొలి సినిమా. బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవ్వాలని ఢిల్లీ నుంచి దిగింది. అయితే సుషాంత్ మరణంతో బెంబేలెత్తిపోయిన అమ్మడు మళ్లీ ఢిల్లీకి దుకాణం సర్దేస్తానని తెలిపింది. సుషాంత్ మరణాన్ని గుర్తు చేసుకుని ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆమె పోస్ట్ ను బట్టి తెలుస్తోంది.
ఇక్కడ పరిస్థితులన్నీ వితంగా ఉన్నాయి. తెలియని, బయటకు చెప్పుకోలేని బాధలు వెంటాడుతున్నట్లు ఉంది. తిరిగి ఢిల్లీకి వెళ్లిపోతాను. బై బై ముంబై అంటూ బాలీవుడ్ కి గుడ్ బై చెప్పింది. అయితే సంజనా సాంఘీ చేసిన ఈ ట్వీట్ పై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నీలో నటి అవ్వాలన్న కమిట్ మెంట్ లేదు. కష్టపడి పనిచేయాలన్న డెడికేషన్ లేదు. నువ్వు హీరోయిన్ గా పనికిరావంటూ…నీకు ఢిల్లీ లోనీ ఇల్లే కరెక్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. జీవితం ఎక్కడా సాఫీగా ఉండదు. ఎదగాలనుకుంటు ఒదిగి ఉండాలి. దారిలో ఉన్న ముళ్లు అన్నింటిని తప్పించుకుని వెళ్లినప్పుడే నీకంటూ ఓ గోల్డెన్ లైఫ్ ఉంటుంది. సక్సెస్ అయిన వాళ్లంతా అలా ఎదిగిన వారే! అంటూ ఉదహరిస్తున్నారు నెటిజన్స్.