సుషాంత్ సూసైడ్ వెనుక మ‌రో ట్విస్ట్

బాలీవుడ్ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య అనంత‌రం ర‌క‌ర‌కాల కార‌ణాలు వినిపించాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచార‌ణ చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సుషాంత్ చ‌నిపోవ‌డానికి కార‌ణంగా ప్రేమ వైఫ‌ల్యమే అంటూ ఆయ‌నకు మాన‌సిక వైద్యం అందించిన డాక్ట‌ర్ తెలిపారు. సుషాంత్ సైకియార్టిస్ట్ కేస‌రి చావ్డాను పోలీసులు విచారించిన నేప‌థ్యంలో కేస‌రి నుంచి ఆవిధ‌మైన స‌మాధానం వ‌చ్చింది. న‌టి అంకిత‌తో బ్రేక‌ప్ విష‌యాన్ని సుషాంత్ త‌ట్టుకోలేక‌పోయాడ‌న్నారు. ఆ విష‌యంలో సుషాంత్ చాలారోజులు బాధ‌ప‌డ్డార‌ని తెలిపారు. అంకిత‌తో ప్రేమ విఫ‌ల‌మైన త‌ర్వాత మాన‌సికంగా చాలా ఇబ్బందుల‌కు గురయ్యాడ‌న్నారు.

అకింత ప్రేమించినంత‌గా మ‌రో అమ్మాయి ప్రేమించ‌లేద‌ని ఎక్కువ‌గా సుషాంత్ ఫీల‌య్యేవాడు అన్నారు. మానసిక బాధ‌తో రాత్రుళ్లు నిద్ర‌పోయేవాడు కాద‌న్నారు. ఆ త‌ర్వాతే న‌టి కృతి స‌న‌న్ తో స్నేహం బ‌ల‌ప‌డింద‌న్నారు. కానీ ఆమెతో బంధం ఎక్కువ కాలం సాగ‌లేద‌న్నారు. సుషాంత్ కూడా ఆమె ప‌ట్ల ఆస‌క్తి ఉండేవాడు కాద‌న్నారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు కుమార్తెను ఇష్ట‌ప‌డ్డాడ‌న్నారు. కానీ ఆ ప్రేమ కూడా ఎన్నో రోజులు లేద‌న్నారు. ఆ త‌ర్వాత రియా చ‌క్ర‌వ‌ర్తి వ‌ల్ల సంతోషంగా ఉన్నాడ‌న్నారు ఆ డాక్ట‌ర్. ఇక సుషాంత్ హీరోగా ప‌రిచ‌యం కాక‌ముందు బుల్లి తెర సీరియ‌ళ్ల‌లో న‌టించాడు.

ఆ స‌మ‌యంలో టీవీ న‌టి అంకితో స్నేహం …ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింది. ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ 2016లో మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా విడిపోయారు. ఇక సుషాంత్ మ‌ర‌ణంతో అంకిత క‌న్నీరు మున్నీర‌య్యాని ఆమె స్నేహితులు తెలిపారు. సుషాంత్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. సుషాంత్ తో క‌లిసి ఉన్నంత కాలం ఆమె ఎంతో సంతోషంగా ఉండేద‌ని, ఆయ‌న మ‌ర‌ణంతో మానసికంగా ఎంతో కృంగిపోతుంద‌ని స్నేహితులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో తాజాగా డాక్ట‌ర్ నుంచి వ‌చ్చిన స‌మాచారంతో విస్మ‌యానికి గుర‌వాల్సిన స‌న్నివేశం. సుషాంత్ మ‌ర‌ణానికి కొంద‌రు బాలీవుడ్ పెద్ద‌లంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కంగ‌నా ర‌నౌత్, ప‌ర్హాన్ అక్త‌ర్, ప్ర‌కాశ్ రాజ్ లాంటి వాళ్లు సుషాంత్ కి అవ‌కాశాలివ్వ‌కుండా ఎద‌గ‌నివ్వ‌లేద‌ని త‌మ పోస్ట్ ల ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే.