బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అందర్నీ కలచివేసిన సంగతి తెలిసిందే. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక సుషాంత్ వదిన కూడా బీహార్ లో కన్నుమూసారు. ఇలా ఒకే రోజు రెండు మరణాలు చోటు చేసుకోవడంతో సుషాంత్ ఫ్యామిలీ మరింత కృంగిపోయింది. ఈ రెండు ఘటనలు దేశంలో సుషాంత్ అభిమానుల్ని, సినీ ప్రముఖుల్ని ఎంతో కలతకుకు గురి చేసాయి. తాజాగా సుషాంత్ అభిమాని కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అభిమాన హీరో లేని లోకంలో నేను ఉండలేనంటూ సూసైడ్ చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలికి చెందిన పదవ తరగతి విద్యార్ధి ఈ ఘటనకు పాల్పడ్డాడు. దానికి సంబంధించి ఓ లెటర్ కూడా రాసిపెట్టాడు.
నా అభిమాన హీరో ఆత్మహత్య చేసుకోలేనిది..నేను ఉరివేసుకోలేనా? అంటూ లెటర్ లో రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సుషాంత్ నటించిన దోనీ బయోపిక్ చిత్రానికి ఎక్కువగా అభిమానులు కనెక్ట్ అయ్యారు. యువత ఎక్కవగా ఆచిత్రాన్ని ఇష్టపడ్డారు. ఈ చిత్రంతోనే సుషాంత్ కు యూత్ లో ఫాలోయింగ్ పెరిగింది. ధోనీని అనుకరించిన విధానం…హెలికాప్టర్ షాట్లు లాంటి సన్నివేశాలతో సుషాంత్ అభిమానులకు బాగా దగ్గరయ్యాడు. అలాగే ధోనీ మ్యానరిజంతోనే మెప్పించడం సుషాంత్ కు చెల్లింది. ఈ కారణాలుగానే సుషాంత్ అభిమానుల పాలిట వెండి తెర ధోనీగా వెలిగిపోయాడు.
సుషాంత్ మరణానంతరం ఎక్కువగా యువత సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి చర్చించడం జరిగిన సంగతి తెలిసిందే.
ఇక సుషాంత్ మరణం వెనుక అనేక కారణాలున్నాయంటూ! కథనాలు వేడెక్కించడం హాట్ టాపిక్ గామారింది. బాలీవుడ్ లో కొందరి పెద్దల తీరు కారణంగా సుషాంత్ మానస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సోషల్ మీడియాలో యువత అభిప్రాయపడుతుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన సుషాంత్ ఎదగడం కొందరు జీర్ణించుకోలేక అతన్ని మానసికంగా ఇబ్బందులకు గురిచేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే కంగనా రనౌత్, పర్హాన్ ఆక్తర్, ప్రకాష్ రాజ్ లాంటి సెలబ్రిటీలు ఆ పెద్దలపై మండిపడిన సంగతి తెలిసిందే.