వైరల్ ఫొటో: స‌న్నీలియోన్ ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు

స‌న్నీలియోన్ ని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు

పోర్న్ స్టార్ నుంచి స్టార్ హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్ అంటే కుర్రకారు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సన్నీ ఐటమ్ సాంగ్ అంటే.. అలా నోరెళ్ల బెట్టుకుని చూసే వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ సన్నీ కోసం నెట్ లో తెగవెతికే జనాలూ ఉన్నారు. ఇప్పుడూ హఠాత్తుగా ఈ సన్నీ జపం ఎందుకంటే. అమ్మడు క్రేజ్ సంగతిని పక్కనబెట్టేస్తే.. ఆమె ఇప్పుడు వేసిన సాగరకన్య గెటప్ వైరల్ గా మారింది. అబ్బ…అదరకొట్టేస్తోంది. సాగరకన్యగా ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యిందని కితాబులు ఇచ్చేస్తున్నారు.

ఓ రీసెంట్ ఫొటో షూట్ లో ఆమె ఇలా దర్శనమిచ్చింది. తన అఫీషియల్ ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో ఈ ఫొటోలు షేర్ చేసింది. సాగరకన్యగా మారటాన్ని ఎంజాయ్ చేస్తున్నా అంటూ కాప్షన్ పెట్టి మరీ వదిలింది.


పోర్న్ సినిమాల నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈమె టాలీవుడ్ తెరపై కూడా స్థానం సంపాదించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన ‘గరుడ వేగ’ సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్‌కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది. దీంతో ఐటెం సాంగ్స్ కోసం సన్నీనే బెట్టర్ ఆప్షన్ అని భావిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు.