గాయకుడు సోను నిగమ్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కుపోయాడు. నిన్న జరిగిన ఓ కార్యక్రంలో సోను నోరు జారాడు. నవ్వుతూ అన్నా, ఆ మాటలు ఇప్పుడు తూటాల్లా పేలుతున్నాయి.
నేను పాకిస్తాన్లో పుట్టివుంటే బాగుండేది. భారత దేశం నుంచి నాకు అవకాశాలు ఎక్కువ వచ్చేవి అన్నాడు. అంతే కాదు భారత దేశంలో ఆడియో కంపెనీలు 40 నుంచి 50 శాతం వరకు రాయితీలు అడుగుతున్నారు, అయితే ఇలా ఆడియో కంపెనీలు విదేశాల్లో రాయతీలు అడగరు. అందుకు ఉదాహరణ పాకిస్తాన్ అని చెప్పాడు.
అయితే ఈ విషయంలో జర్నలిస్టులదే తప్పని తాను ఏ సందర్భంలో అన్నానో అది పూర్తిగా వ్రాయకుండా, కేవలం పాకిస్తాన్లో పుట్టివుంటే .. అని మాత్రం రిపోర్ట్ చెయ్యడం అన్యాయమని చెబుతున్నాడు
సోను చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ హాట్ గా వున్నాయి.పాకిస్తాన్ ను కీర్తించడం అనుచితం , మరి ఈ సమస్య నుంచి ఎలా బయట పడతాడో చూడాలని .