‘ఐదేళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొని, 14 ఏళ్లకు అత్యాచారానికి గురైన బాధితురాలిగా..మీ ముందు నిలబడ్డా, మీటూ ఉద్యమానికి మద్దుతు ఇస్తున్నా అంటున్నారు నటి సోమీ అలీ . ‘మీటూ’ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో సోమీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్ ని షేర్ చేశారు. తన జీవితపు జర్నీలో ఎందరో మృగాళ్లు పరిచయం అయ్యారని ఆమె అన్నారు.
తనకు హిందీ నేర్పిన ట్యూటర్, మేకప్ మేన్, ఓ ఫిలిం డైరెక్టర్ నాపై అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసారని ఆమె ఆవేదనతో అన్నారు. ఈ పాకిస్తానీ నటి సోమీ అలీ ఒకప్పుడు సల్మాన్ ఖాన్ గాళ్ ఫ్రెండ్. అతనతో కలిసి సినిమాల్లోనూ నటించింది. అలాగే బాలీవుడ్ లో చిత్రాల్లో నటించేప్పుడు `ఆందోళన్` దర్శకుడు తనను వేధించాడని తెలిపింది సోమి.
ఇక తనను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించిన సదరు మేకప్ మేన్… మాధురి ధీక్షిత్ కు పర్సనల్ మేకప్ మేన్ అని ఓపెన్ చేసేసింది సోమి అలీ. అలాగే ఆ ట్యూటర్ పేరు గౌతమ్ అంటూ చెప్పింది.
తమకు ఎదురైన వేధింపుల గురించి ధైర్యంగా ముందుకొచ్చి చెబుతున్న మహిళలకు ‘సెల్యూట్’ చేశారు. ఇలా బయటపడి మాట్లాడటం చాలా కష్టమని, దానికి చాలా సమయం పడుతుందని చెప్పారు.