శివ సేన సుప్రీమ్ బాలసాహెబ్ థాక్రే జీవిత కథ త్వరలో వెండితెరపై రాబోతుంది. ఆ చిత్రానికి కూడా ‘థాక్రే’ అనే టైటిల్ పెట్టారు నవాజుద్దీన్ సిద్ధిఖి థాక్రేగా నటిస్తున్నారు. ఆయన భార్య పాత్రలో హీరోయిన్ అమృతరావు చేస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను రీసెంట్ గా విడుదల చేశారు. థాక్రేగా నవాజుద్దీన్ సరిగ్గా సరిగ్గా కుదిరారని అందరూ మెచ్చుకుంటున్నారు.
మరాఠీ స్టయిల్‌లో తన శైలి ఉండేందుకు నవాజు తీవ్రంగా కృషి చేసినట్టు ట్రైలర్‌ను బట్టి అర్ధమవుతుంది. టీజర్ మొత్తం థాక్రేనే చూస్తున్నట్టే ఉంది. అయితే హీరో సిద్దార్ద మాత్రం ఇది ద్వేషాన్ని పెంచుతోంది. సౌతిండియన్స్ ని ఈ ట్రైలర్ అవమానపరుస్తోంది. ద్వేషాన్ని మీరు బిజినెస్ గా చేయద్దు అని అర్దం వచ్చేలా ఆయన ట్వీట్ చేసారు. ‘ఉతో లుంగి బాజో పుంగి ‘ డైలాగులపై ఆయన నిరసన వ్యక్తం చేసారు.
https://twitter.com/Actor_Siddharth/status/1077980147251331073
ఇక ఉర్దూ రచయిత ‘మ్యాంటో’గా నవాజు చేశాక థాక్రే తర్వాతి చిత్రం. జర్నలిస్టు, ఎంపీ సంజరు రౌత్ రాసిన కథ ఆధారంగా దర్శకుడు అభిజిత్ పన్సే తెరకెక్కించారు. ఈ చిత్రం హిందీ, మరాఠీ భాషల్లో తెరకెక్కింది. ఇంగ్లిష్‌లో కూడా డబ్ చేస్తున్నారు.
సందీప్ చటర్జీ కెమెరా వర్క్, అమర్ మోహ్లీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి హైలెట్ అయ్యాయి. నవాజుద్దీన్ సిద్దిఖీ, థాక్రేగా జీవించేసాడు. అతని గెటప్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సూపర్బ్.. రాజ్యసభ ఎంపీ, శివసేన స్పోక్ పర్సన్ సంజయ్ రౌత్ ఈ సినిమాకి కథ అందించగా, అభిజీత్ పాన్సే డైరెక్ట్ చేసాడు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ మరికొందరి భాగస్వామ్యంతో నిర్మించింది. నవాజుద్దీన్ సరసన అమృత రావు నటించిన థాక్రే, 2019 జనవరి 25న మరాఠీ, హిందీ భాషల్లో విడుదల కానుంది