తెలుగు స్టేట్స్ లో “లైగర్” కి భారీ బిజినెస్ ఎవరికో తెలిస్తే షాకే మరి..!

ఇప్పుడు మన తెలుగులో మోస్ట్ అవైటెడ్ గా ఉన్నటువంటి పలు చిత్రాల్లో దర్శకుడు పూరి జగన్నాద్ మరియు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన సాలిడ్ యాక్షన్ చిత్రం “లైగర్” కూడా ఒకటి.

అయితే ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. దీనితో బిజినెస్ పరంగా కూడా రికార్డు ఫిగర్స్ నమోదు చేస్తున్నట్టే తెలిసింది. ఆల్రెడీ డిజిటల్ మరియు సాటిలైట్ హక్కులు 70 కోట్ల మేర జరగగా తెలుగు వెర్షన్ ఏపీ మరియు తెలంగాణాలో కూడా రికార్డు మొత్తానికే ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీలో తెలుస్తుంది.

మరి ఈ చిత్రానికి అయితే తాను ఏకంగా 63 కోట్లు  కొనుగోలు చేశారట. ఇక ఇంతకీ ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా ఎవరో కాదు రీసెంట్ గా “ఆచార్య” సినిమాని కొనుగోలు చేసిన వరంగల్ శ్రీను అట. ఆ సినిమాకే ఎలాంటి లాసులు వచ్చాయో తెలిసిందే. అయినా కూడా మళ్ళీ 60 కోట్లు పెట్టారంటే షాకింగ్ అనే చెప్పాలి.

మరి చూడాలి ఈ సినిమాకి అయితే ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి. మరి ఈ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో ఈ ఆగస్ట్ 25న రిలీజ్ కాబోతుంది. అలాగే ఛార్మి మరియు కరణ్ జోహార్ లు భారీ ఎలిమెంట్స్ తో నిర్మాణం వహించారు.