‘షకీలా’ఫస్ట్‌లుక్: నగ్నంగా.. నగలు మాత్రమే అడ్డం

ఈ కాలంలో ఎటు చూసినా బయోపిక్ లదే హవా నడుస్తోంది. రాజకీయనాయకుల బయోపిక్ లతో పోటా పోటీగా క్రీడాకారులు,సినిమా స్టార్స్ బయోపిక్ లు సైతం సిద్దమవుతున్నాయి. ఇప్పుడు షకీలా జీవిత చరిత్ర కూడా తెరకెక్కుతోంది. దాదాపు రెండు ద‌శాబ్దాల‌పాటు ద‌క్షిణాదిన శృంగార తార‌గా ఓ వెలుగు వెలిగిన న‌టి ష‌కీలా. ఆ వెలుగు ఎంతలా అంటే… మ‌ళయాళంలో ఈమె సినిమాలు స్టార్ హీరోల సినిమాల‌కు కూడా పోటీ వ‌చ్చేవి. ఆ స్దాయిలో సినీ ప్రపంచాన్ని ఏలిన ష‌కీలా జీవిత‌క‌థ ఆధారంగా ఈ బ‌యోపిక్ తెర‌కెక్కుతోంది.

ష‌కీలా పాత్ర‌లో హ్యూమా ఖురేషి లేదా స్వ‌ర భాస్క‌ర్ వంటి న‌టీమ‌ణుల‌ను తీసుకోవాల‌ని ద‌ర్శ‌కనిర్మాత‌లు భావించారు. అయితే ఆ పాత్ర బాలీవుడ్ హీరోయిన్ రిచా చ‌ద్దాను వ‌రించింది. ష‌కీలా పాత్ర‌లో రిచా చ‌ద్దా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచొచ్చింది. ఈ నేపధ్యంలో చిత్రం ఫస్ట్ లుక్ ని నిర్మాతలు వదిలారు. 

ఈ ‘షకీలా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో షకీలా పాత్రధారి రిచా చద్దా నగ్నంగా ఒంటిపై నగలతో తన శరీరాన్ని కప్పి బోల్డ్ లుక్‌లో కనపడి షాక్ ఇచ్చింది. ఈ ఫస్ట్ లుక్‌కి బోల్డ్ అండ్ ఫియర్ లెస్ అనే క్యాప్షన్ ఇచ్చింది రిచా.

ఇక ఈ సినిమా కోసం రిచా ప్ర‌స్తుతం మ‌ల‌యాళం నేర్చుకుంటోంది. అలాగే ష‌కీలాతో మాట్లాడి ఆమె జీవితం గురించి కూడా తెలుసుకుంటోంది. ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలోనూ ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. మ‌రి, సిల్క్ స్మిత జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `డ‌ర్టీపిక్చ‌ర్‌` త‌ర‌హాలో ఈ ష‌కీలా బ‌యోపిక్ కూడా ఆక‌ట్టుకుందో, లేదో చూడాలి. 2019 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘షకీలా’.