షకీలాకి ఇది మొదటి “బిగ్ బాస్” కాదట

తెలుగు బుల్లి తెర దగ్గర ఒక పాత్ బ్రేకింగ్ రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి. అప్పటివరకు ఎన్నెన్నో ఛానెల్స్ లో ఎన్నో షోలు ఉన్నాయి కానీ ఈ కొత్త షో తెలుగు వారికి మరింత కొత్తగా అనిపించింది. అందుకే భారీ రేటింగ్స్ ఇచ్చి మరీ ఈ షోని నెత్తిన పెట్టుకున్నారు.

అయితే ఒక నాలుగు సీజన్ల వరకు కూడా రికార్డు రేటింగ్స్ మైంటైన్ చేసిన షో నెక్స్ట్ రెండు సీజన్ లలో దెబ్బ తిన్నది. దీనితో ఏడవ సీజన్ ని మాత్రం చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. అందుకే చాలా వరకు తెలిసిన మొహాలనే ఎంచుకొని షో స్టార్ట్ చేశారు. మరి వీరిలో తెలుగు ఆడియెన్స్ కి ఒకింత షాకింగ్ గా అనిపించింది నటి షకీలాని చూసి.

షకీలా బిగ్ బాస్ కి రావడం ఏంటి అని చాలా మంది అనుకున్నారు. అయితే ఇప్పుడు షకీలా విషయంలో తెలుగు ఆడియెన్స్ కి చాలా వరకు తెలియని అంశం ఏమిటంటే ఈమె బిగ్ బాస్ షో కి రావడం మొదటిసారి కాదట. ఈమె ఇది వరకే ఓ బిగ్ బాస్ షో లో ఆడి వచ్చిందే అని చాలా మందికి తెలియదు.

అయితే ఆమె మొదటగా కనిపించింది కన్నడ బిగ్ బాస్ షో లో అని ఇది జరిగి ఏకంగా తొమ్మిదేళ్లు పూర్తి అయ్యింది. మరి మళ్ళీ ఇపుడు ఈమెని తెలుగు బిగ్ బాస్ కోసం తీసుకొచ్చారు. అయితే షకీలా అప్పుడూ బిగ్ బాస్ లో పెద్దగా ఆడింది ఏమీ లేదు ఇప్పుడు పెద్దగా ఆడింది లేదు అని పలువురు నెటిజన్స్ అయితే అంటున్నారు. మరి తెలుగు సీజన్లో షకీలా ఎంతవరకు నెట్టుకొస్తుందో చూడాలి మరి.