అసాధారణ వ్యక్తి బయోపిక్ చేస్తున్న మెగాస్టార్

Salman Khan to do black tiger biopic
Salman Khan to do black tiger biopic
 
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. వాటిలో ఒకటి స్పై థ్రిల్లర్.  స్పై సినిమా అంటే అలాంటి ఇలాంటి స్పై సినిమా కాదు.  ఒక నిజమైన స్పై జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా. స్పై అంటే ముందుగా విదేశీ సినిమాలే గుర్తుకొస్తాయి. ప్రతి దేశానికీ రహస్య గూఢచారులు ఉంటారు.  అలాగే మన దేశానికీ ఉన్నారు.  వీరంతా ఇంటెలిజెన్స్ విభాగంతో కలిసి పనిచేస్తుంటారు.  శత్రు దేశాల్లో తిరుగుతూ రహస్యాలను కనుగొనడమే ఈ స్పైల పని.  అంతేనా వీరి పని అనుకుంటే పోరపాటే.  ఎందుకంటే వీరి జీవితమే ఒక సాహసం అన్నట్టు ఉంటుంది. 
 
అనుక్షణం ప్రమాదాల అంచున పనిచేస్తుంటారు.  సాహసాలే ఊపిరిగా బ్రతుకుతారు. మన దేశం చూసిన గూఢచారుల్లో రవీంద్ర కౌశిక్ ఉత్తమమైన గూఢచారి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో, ఏం చేస్తుంటాడో ఎవ్వరికీ తెలీదు.  ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇతన్ని బ్లాక్ టైగర్ అంటున్నారు.  పూర్తి సమర్థత కలిగిన రవీంద్ర కౌశిక్ ఎన్నో అసాధారణ మిషన్స్ చేయడం జరిగింది. ఈయన జీవితం ఆధారంగానే రాజ్ కుమార్ గుప్త ఒక కథను రాసుకున్నారట.  సుమారు ఐదేళ్లపాటు రీసెర్చ్ చేసి ఈ స్టోరీని లాక్ చేశారట ఆయన.  ఆ కథను విన్న సల్మాన్ ఖాన్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారట.  ఈ రియాలిస్టిక్ స్పై స్టోరీ సల్మాన్ ఖాన్ కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.  అంతేకాదు సల్మాన్ ఒక బయోపిక్ చేయడం ఇదే తొలిసారి కూడ.