బాలకృష్ణ.. నందమూరి నటసింహంగా తనదైన సినిమాలో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. హీరోల్లో ఆయనది విభిన్నశైలి. రాజకీయాలు, సినిమాలతో ఆయన బిజీ. అందుకే ఆయన సినిమాలు పొలిటికల్ గా లేకపోయినా.. పొలిటకల్ పంచులతో అదరగొట్టేస్తాయి. ఈక్రమంలో బాలయ్య ఓ ప్రయోగం చేశారు. తండ్రి ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కించారు. ఎన్టీఆర్.. కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను రెండు పార్టులుగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించారు. అయితే.. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ్ద సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. కథ, బాలకృష్ణ మేకోవర్ పై అనేక విమర్శలు వచ్చాయి. ఇటివల ఈ సినిమాపై పెదవి విప్పారు బాలయ్య. ఇటివల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..
‘సినిమా విషయంలో నేను న్యాయం చేయలేదు. ఎంచుకున్న కథలోనే కొన్ని లోపాలున్నాయి. కథలో కొన్ని విషయాలు చెప్పలేకపోయాయాం. సినిమా ప్రారంభించినప్పుడు రెండో పార్ట్ అనుకోలేదు. ఒక సినిమాగానే అనుకున్నాం. తర్వాత కథ పరిధిని పెంచినా న్యాయం చేయలేకపోయాను. కొన్ని లోపాలున్నాయి’ అని అన్నారు. రూలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘సినిమాల్లో గెలుపోటములు సహజం.. ఫలితాలు మన చేతుల్లో ఉండవు’ అని పరోక్షంగా ప్రస్తావించారు. రెండేళ్ల తర్వాతే సినిమాపై పూర్తిగా స్పందించారని చెప్పాలి. ఎన్టీఆర్ జీవితకథ ప్రకటించినప్పుడు.. షూటింగ్ సమయంలో భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ.. ఫలితం తారుమారైంది. సినిమాలో బాలయ్య మేకోవర్ పై కూడా విమర్సలొచ్చాయి. సినిమా ప్రారంభించినప్పుడు దర్శకుడు తేజతో సినిమా ప్రారంభమైంది.
కొన్ని కారణాలతో ప్రాజెక్టు నుంచి తేజ తప్పుకోవడంతో దర్శకుడు క్రిష్ కు దర్శకత్వం అప్పగించారు. అప్పుడే సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాని నిర్ణయించారు. ఒకభాగం సినిమా.. మరో భాగం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించారు. కానీ.. ఫలితం నిరాశాజనకంగా వచ్చింది. బయోపిక్ గా ఎన్టీఆర్ జీవితకథకు పూర్తిగా న్యాయం చేయలేదనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పై బాలకృష్ణ ఓ పుస్తకాం రాస్తున్నట్టు ప్రకటించారు. తన తండ్రిపై తనను మించి ఎవరూ పుస్తకం రాయలేరని.. ఎవరన్నా రాస్తుంటే కూడా విరమించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ, గోపీచంద్ మలినేనితో ఓ సినిమా, అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తున్నారు.