నాన్న బయోపిక్ సినిమా చేయడం ఇష్టం లేదు.. నాన్న బయోపిక్ చేస్తే కొందరు బాధపడతారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రామానాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మూవీ మొగల్ గా పేరు సంపాదించుకున్న రామానాయుడు గారు మరణాంతరం సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ వ్యవహారాలన్ని సురేష్ బాబు చూసుకుంటున్నారు. వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఈ విధంగా సురేష్ బాబు నిర్మాతగా ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇకపోతే సురేష్ బాబుకి తన తండ్రి రామానాయుడు బయోపిక్ చిత్రం గురించి ఓ ప్రశ్న ఎదురయింది.రామానాయుడు గారి బయోపిక్ చిత్రం గురించి ప్రశ్నించగా చాలామంది నాన్న బయోపిక్ చిత్రం చేయమని అడుగుతున్నారు అయితే ఈ సినిమా చేయకపోవడానికి ఒక కారణం ఉందని వెల్లడించారు. సాధారణంగా మా కుటుంబ వ్యక్తిగత విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతాము. ఈ విషయాలను బయట ఎక్కడ ప్రస్తావించము.అయితే బయోపిక్ చిత్రం చేస్తే ఆ విషయాలన్నింటినీ బయట పెట్టాల్సి ఉంటుంది.

అలా వ్యక్తిగత విషయాలు గురించి కాకుండా సినిమా జీవితం గురించి చూపిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ఇక ఆయన సినీ జీవితంలో కూడా కొందరి వల్ల ఆయన బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ విషయాలను బయట పెడితే ప్రస్తుతం వారు కూడా బాధపడతారు. అందుకే నాన్న బయోపిక్ సినిమా చేయాలని అనుకోవడం లేదు అంటూ సురేష్ బాబు తెలిపారు.అయినా ప్రస్తుత కాలంలో వస్తున్న బయోపిక్ చిత్రాలలో ఏది నిజం లేదని అన్ని మార్పులు చేసి అదే నిజం అంటూ చూపిస్తున్నారు అని ఈ సందర్భంగా సురేష్ బాబు పేర్కొన్నారు.