ఇప్పుడు సేమ్ టు సేమ్ ..షాహిద్ కపూర్ కుటుంబ సభ్యుల స్పందన ఇదే. తమ కుటుంబ సభ్యుడైవ షాహిద్ కు స్టమక్ కాన్సర్ వచ్చిందని పుకారు పుట్టించి…దాన్ని రాకెట్ స్పీడులో వ్యాపింప చేసిన వాళ్లను ఫ్యామిలీ మెంబర్స్ శాపనార్దాలు పెడుతున్నారు.
అయినా అంతగా వార్తలు కావాలంటే ఏ హీరోయిన్ తో నో లింక్ పెట్టినా ఓకే లేకపోతే షాహిద్ నెక్ట్స్ చేయబోయే సినిమా కథ ఇది అన్నా ఓకే..అంతేకానీ ఇలా రోగాలు ఉన్నాయంటూ ప్రచారం చేసి,, కెరీర్ కి దెబ్బ కొట్టాలనే ఆలోచన దారుణం అంటున్నారు అభిమానులు. ఇంతకీ ఏమి జరిగిందంటీ అంటే…
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో, జనరల్ మీడియాలో షాహిద్ కపూర్ కు స్టమక్ కాన్సర్ వచ్చిందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు ఏ మూల బయిలుదేరాయో కానీ దావానలంగా వ్యాపించాయి. షాహిద్ కపూర్ స్టార్ స్టేటస్ ఉన్న హీరో కావటంతో బాలీవుడ్ మీడియా సైతం దానికి ప్రయారిటీ ఇచ్చింది. నిజానిజాలు చూసుకోకుండా ప్రసారం చేసేసింది. ఇది సాధారణంగానే అభిమానుల్లో కంగారు పుట్టించింది.
వాళ్లంతా షాహిద్ కపూర్ మేనేజర్ కు మెసేజ్ లు పెట్టడం..ఆయన పేజిలో పోస్ట్ లు పెట్టడం వంటివి చేస్తున్నారు. మరికొందరు వీరాభిమానులు..గుళ్లకు వెళ్లి మరీ ఆయన ఆరోగ్యం కుదుట పడాలని పూజలు చేయిస్తున్నారు. ఇదంతా గమనించిన షాహిద్ …ఫ్యామిలీ వివరణ ఇస్తూ మీడియా తో మాట్లాడాల్సి వచ్చింది. షాహిద్ ఏ అనారోగ్యమూ లేదని..చాలా ఆరోగ్యంగా ఉన్నాడని ..చక్కగా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడని తేల్చి చెప్పారు.